
| Movie Name | Urvasivo Rakshasivo ( ) |
|---|---|
| Director | Rakesh Sashii |
| Star Cast | Allu Sirish, Anu Emmanuel |
| Music | Achu |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Purna Chary |
| Music Label | Aditya Music |
అనగా అనగనగ… కనులే కలగనగా
నిజమయ్యే మెరుపల్లే వాలెగా
నా ఊపిరి నడక… తన ఊపిరి జతగ
కలగలిసి మొదలయ్యే… నాలో అలజడిగా
అరెరే అరెరె… మనసే అదిరే
నీవల్ల నాలోన ఈ అల్లరే
ఎవరే ఎవరే… కుదురే చెదిరే
తొలిసారి తనువంత ఓ జాతరే
ఆరాటము మెహమాటము
జతగా కలిగే టెన్ టు ఫైవ్ నాకెందుకో
అలవాటులో పొరపాటుగా
నను నేను దాస్తున్నానెందుకో..!
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే… ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి… నీతో కలిసే
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే… ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి… నీతో కలిసే
నీ అడుగుల వెంట… నే గురుతై ఉంటా
నీ పాదమే దాటు… ప్రతి చోటున
నీ పెదవులు తాకే… నా పేరును వింట
ఓ స్పర్శకే పొంగి పోతానట
కాలం కలిపింది… ఈ జోడి బాగుందని
ప్రాణం అడిగింది… నీతోడు సాగాలని
దూరం దూరం అయ్యే దారే చూపిస్తుంది
ఒకటవ్వనే, ఓఓ ఓ ఓ
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే… ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి… నీతో కలిసే
ఆకాశం తానే… చినుకల్లే మారి
అక్షింతలై పైన రాలాయిగా
ఆ ఉరుముల శబ్దం… మనసున నిశ్శబ్దం
మోగాయిలే మేళతాళాలుగా
రాయబారాలు పంపాను… నా భాషలో
రాయలేనన్ని భావాలు… నా ఊహలో
మౌనం మౌనం వీడి… మాటే నేర్పిస్తుంది
ఈ ప్రేమలో, ఓఓ ఓ ఓ
ధీంతనన ధీంతనన నీచూపుల దాడి
చేసిందే చేసిందే… ఈ గారడి
ధీంతనన ధీంతనన
నన్నే నే వీడి… నీతో కలిసే
Dheemthanana song is from the Urvasivo Rakshasivo ( ) movie.
Dheemthanana song was sung by Sid Sriram.
Dheemthanana song lyrics were written by Purna Chary.
Dheemthanana song music was composed by Achu.