
| Movie Name | |
|---|---|
| Director | K. Balachander |
| Star Cast | Rajinikanth, Jayaprada, Jayalakshmi, Sripriya |
| Music | M.S.Viswanathan |
| Singer(s) | K J Yesudas |
| Lyricist | Acharya Athreya |
| Music Label | Saregama Telugu |
Devude Ichadu Veedhi Okati Lyrics in Telugu
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు… వీధి ఒకటి
ఇక ఊరేల… సొంత ఇల్లేలా
ఇక ఊరేల సొంత ఇల్లేలా, ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం… ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం… ఏది పరమార్ధం
నన్నడిగి తలిదండ్రి కన్నారా
ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాదికాదే
పోవే పిచ్చమ్మా
నారుపోసి నీరుపోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే, ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం… ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల ఈ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు… తుదకు మన్ను
ఈ బ్రతుకెంత? దాని విలువెంత ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మణిక్యాన్ని వెదికే వెర్రమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం… ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం, ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం… ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
Devude Ichadu Veedhi Okati song is from the movie.
Devude Ichadu Veedhi Okati song was sung by K J Yesudas.
Devude Ichadu Veedhi Okati song lyrics were written by Acharya Athreya.
Devude Ichadu Veedhi Okati song music was composed by M.S.Viswanathan.