
| Movie Name | Chandramukhi |
|---|---|
| Director | P Vasu |
| Star Cast | Rajnikanth, Nayanathara, Jyothika |
| Music | Vidyasagar |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Aditya Music |
అరె అరె అరె అరె అరె
దేవుడ దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా… కళ్లు విప్పి చూడరా
హోయ్ దేవుడ దేవుడా… తిరుమల దేవుడా
చూడర చూడరా… కళ్లు విప్పి చూడరా
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువ్ కొంచెం సానపెట్టరా, రిపీటు
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువు కొంచెం సానపెట్టరా
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే, ఓ ఓ ఓ
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే, ఓ ఓ ఓ
దేవుడ దేవుడా… తిరుమల దేవుడా
చూడర చూడరా… కళ్లు విప్పి చూడరా
హో ఆరే ఆరే ఆరే ఆరే… అరెరే ఆరే అరెరే ఆరే
ఆలోచించు కొంచెం… రైతుబిడ్డ కష్టం
అందరి ఆకలి తీర్చేటందుకు… ఓడుస్తాడు స్వేదం
(హెయ్ హెయ్ హెయ్ హెయ్)
వాడలోని మలినం శుభ్రం చేసేవారు
నాలుగు రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు
మాసిన జుట్టు పనీర్ పట్టె వాడంటూ లేకుంటే
తగ్గుతుందా తల బరువూ
నీళ్లల్లోనే నిలిచి ఉతికే వాడంటూ లేకుంటే
నిలుచునా మన పరువూ
ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు
దైవం అని బ్రహ్మంగారు నాడే అన్నారోయ్, రిపీటు
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే, ఓ ఓ ఓ
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే, ఓ ఓ ఓ
ఆ, దేవుడా దేవుడా తిరుమల దేవుడా
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
నీ గురించి ఎవరో… అరె ఏమనుకుంటే ఏమి
ఈ చెవితోటి విన్నాదాన్ని… ఆ చెవిలోంచి వదిలేయ్
మేఘం సాగుతున్నా… కాకులు మూగుతున్నా
ఆకాశానికి మలినాలేవి… అంటుకోవని చెప్పెయ్
పూలబంతి పట్టి నీటి మధ్యలో ఉంచినా
తేలుతుందోయ్ పైకి సోదరా
అరె నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా
తేలిరారా పూలబంతిలా
మిణుగురు పురుగులు ఎన్నెన్నున్నా
పున్నమినాటి జాబిలి చల్లే… పండు వెన్నెలనాపగలదా, రిపీటు
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే, ఓ ఓ ఓ
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే, ఓ ఓ ఓ
దేవుడ దేవుడా… తిరుమల దేవుడా
(ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే)
చూడర చూడరా కళ్లు విప్పి చూడరా
(ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే ఆరే)
స్వామి, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువు కొంచెం సానపెట్టరా, రిపీటు
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు
నువు కొంచెం సానపెట్టరా, శభాషు
శక్తులన్నీ వచ్చి చేరుకుంటే, ఓ ఓ ఓ
స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే, ఓ ఓ ఓ
Devuda Devuda Tirumala Devuda song is from the Chandramukhi movie.
Devuda Devuda Tirumala Devuda song was sung by S P Balasubramanyam.
Devuda Devuda Tirumala Devuda song lyrics were written by Bhuvana Chandra.
Devuda Devuda Tirumala Devuda song music was composed by Vidyasagar.