
| Movie Name | |
|---|---|
| Director | S V Krishna Reddy |
| Star Cast | Srikanth, Ramya Krishna, Heera |
| Music | S V Krishna Reddy |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Volga Video |
దేవతలారా రండి
మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే
నా తోడును పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండీ
మ్ మ్ మ్ ఓఓఓ ఓ
శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి
ప్రతి సంసారంలోనూ… మా కథలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరినీ… మా జతలో చూపించాలి
శ్రీకాంతుల కొలువంటే… మా కాపురమనిపించాలి
మా ముంగిలి లోన పున్నమి
పూల వెన్నెల విరియాలి
మా చక్కని జంట
చుక్కల తోట పరిపాలించాలి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆఆ
తన ఎదపై రతనంలా
నిను నిలిపే మొగుడొస్తాడు
నీ వగలే నగలంటూ
గారాలే కురిపిస్తాడు
తన ఇంటికి కళ తేచ్చే
మహాలక్ష్మిగ పూజిస్తాడు
తన కంటికి వెలుగిచ్చే
మణి దీపం నీవంటాడు
ఈ పుత్తడి బోమ్మ మెత్తని పాదం
మోపిన ప్రతి చోట
నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
దేవతలారా రండి
మీ దీవెనలందించండి
నోచిన నోములు పండించే
నా తోడును పంపించండి
కలలో ఇలలో ఏ కన్నెకి
ఇలాంటి పతిరాడనిపించే
వరుణ్ణే వరముగ ఇవ్వండి
కనీవిని ఎరుగని వేడుకతో
వివాహం జరిపించాలండి
Devathalara Deevinchandi song is from the movie.
Devathalara Deevinchandi song was sung by S P Balasubramanyam, Chitra.
Devathalara Deevinchandi song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Devathalara Deevinchandi song music was composed by S V Krishna Reddy.