
| Movie Name | Aapadbandhavudu |
|---|---|
| Director | K Viswanath |
| Star Cast | Chiranjeevi, Meenakshi Seshadri |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, KS Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Lahari Music | T-Series |
చుక్కలారా చూపుల్లారా
ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా
తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
విన్నవించరా వెండి మింటికీ
జో జో లాలీ… జో జో లాలీ
జో జో లాలీ… జో జో లాలీ
మలి సంధ్య వేళాయే
చలి గాలి వేణువాయే
నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే
కనుపాప నిన్ను కోరే
కునుకమ్మా ఇటు చేరవే
తన్ననన్న తాననా
తన్ననన్న తాననా
నిదురమ్మా ఎటు పోతివే, ఇటు చేర్…
గోధూళి వేళాయే… గూళ్ళని కనులాయే
గోధూళి వేళాయే… గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా… రివ్వు రివ్వున రావే
జోల పాడవా బేల కళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో లాలీ… జో జో లాలీ
జో జో లాలీ… జో జో లాలీ
పట్టుపరుపులేల… పండువెన్నెలేల
అమ్మ ఒడి చాలదా… బజ్జోవే తల్లి
పట్టుపరుపేలనే, వె న్…
అమ్మ ఒడి చాలునే… నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేల… నాదబ్రహ్మలేల
అమ్మ లాలి చాలదా… బజ్జోవే తల్లి
నారదాదులేలనే… నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే… నిన్ను కమ్మంగ లాలించునే
చిన్నిచిన్ని కన్నుల్లో… ఎన్నివేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో… ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడి కొమ్మలాల
ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల
కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల
గొల్లభామలాల యాడనుందియాల
నాటి నందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టితల్లికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో జో లా… జో జో లాలి
చుక్కలారా చూపుల్లారా
ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా
తప్పుకోండీ దారికీ
Chukkallara Choopullara song is from the Aapadbandhavudu movie.
Chukkallara Choopullara song was sung by S P Balasubramanyam, KS Chitra.
Chukkallara Choopullara song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Chukkallara Choopullara song music was composed by M M Keeravani.