
| Movie Name | & English - Most Eligible Bachelor |
|---|---|
| Director | Bommarillu Bhaskar |
| Star Cast | Akhil Akkineni, Pooja Hegde |
| Music | Gopi Sundar |
| Singer(s) | Zia Ul Haq |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఓ సోనియే ఓ సోనియే… ఓ సోనియే
అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగా
సరిలే ఇపుడైనా
తెలిసిందిగా తొలిసారి
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక
ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
ఊరేగించిన ఈ లోకం
తన బరువు తానే సరిగా
మోయలేని ఓ మాలోకం
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగా
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక
శిలలాంటి నిన్ను ఇలా… శిల్పంగా మలిచింది
ఆ నవ్వులో చురకలే
నీ సొంత కలలాగా… నీ కంట నిలిచింది
ఆ దివ్వెలో మెరుపులే
అచ్చంగా తనలా ఉందా
అద్దం చూపే నీ రూపం
నీ సొంత చిరునామాలా
కనిపిస్తోందా ఈ మలుపు
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగా
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక
ఎన్నెన్ని జన్మాలైనా… తెగిపోని బంధమేదో
ఎదురైంది నీ దారిలో, ఓ ఓ
మాటలకందని భావం… మనసెలా గుర్తిస్తుందో
తెలిసింది ఆ చెలిమితో
ఇంకెవరి కల్లో చూసే
కలవే నువ్వు ఇన్నాళ్లు
ఎంత బాగుందో చూడు
నీ తొలి వేకువ ఈనాడు
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగా
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక
అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగా
సరిలే ఇపుడైనా
తెలిసిందిగా తొలిసారి
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక
ఇన్నాళ్లు నిన్నెత్తుకొని
ఊరేగించిన ఈ లోకం
తన బరువు తానే సరిగా
మోయలేని ఓ మాలోకం
ఇన్నాళ్లు గాలిలోనే
తేలియాడే చిట్టి అడుగా
ఇకనైనా నేల తాకి
నేర్చుకోవే కొత్త నడక ||2||
ఓ సోనియే, హే హే ఏ ఏ
Chitti Adugu song is from the & English - Most Eligible Bachelor movie.
Chitti Adugu song was sung by Zia Ul Haq.
Chitti Adugu song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Chitti Adugu song music was composed by Gopi Sundar.