Chirunavvulatho Brathakali Song Lyrics - Mee Sreyobhilashi

Chirunavvulatho Brathakali Song Lyrics - Mee Sreyobhilashi
Chirunavvulatho Brathakali Song Lyrics: Chirunavvulatho Brathakali is a Telugu song from the film Mee Sreyobhilashi starring Rajendra Prasad, Naresh, Radha Kumari, directed by V. Eshwar Reddy. "Chirunavvulatho Brathakali" song was composed by Koti and sung by S P Balasubramanyam. Lyrics were written by Venigalla Rambabu.

Chirunavvulatho Brathakali Song Details

Movie NameMee Sreyobhilashi (2007)
DirectorV. Eshwar Reddy
Star CastRajendra Prasad, Naresh, Radha Kumari
MusicKoti
Singer(s)S P Balasubramanyam
LyricistVenigalla Rambabu
Music Label

Chirunavvulatho Brathakali Song Lyrics in Telugu

ఆత్మీయత కరువైనా… అంధకారం ఎదురైనా

బ్రతకడమే బరువైనా… స్థితిగతులవి ఏవైనా… ఆ ఆఆ

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

ఆనందాలను అన్వేషిస్తూ… అందరికోసం బ్రతకాలి

అందరినీ బ్రతికించాలి…

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

బ్రతుకే నీకు బరువైతే… ఆ భారం దించుకో

బరువేదైనా గురితో… ఓ నలుగురితో పంచుకో

కలతే లేని జీవితమంటే… విలువే లేదులే

అలుపే లేక అవలీలగ… ఏ గెలుపూ రాదులే

నింగినంటు ఎవరెస్టైనా… నేలనుండి మొదలౌతుంది

నమ్ముకోకు అదృష్టాన్ని… నమ్ముకో ధైర్యాన్ని

మెరుపులే పిడుగులై ఉరుముతున్నా… ఉరకలు వేసే కిరణం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి… చిరుదివ్వెలుగా వెలగాలి

చిరునవ్వులతో బ్రతకాలి… చిరుదివ్వెలుగా వెలగాలి

లోకం నిండిన శోకం తుడిచే… వేకువలా ఉదయించాలి

వెన్నెలనే కురిపించాలి…

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

ఎదిగే పక్షిరెక్కకు సహజం… ఎగిరే లక్షణం

వదిలేస్తుంది నిన్నటి గూటిని… కదిలే ఆ క్షణం

ఏదీ నీది కాదని అనుకో… ఏదోనాటికి

అయినా రేపు మిగిలే ఉంది… ఆశావాదికి

కొమ్మలన్నీ చుక్కలవైపే… కోరికోరి చూస్తున్నా

మట్టితోటి అనుబంధాన్ని… చెట్టు మరువగలదా

చీడలే నీడలై వీడకున్నా… అందరి బృందావనమే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి… శ్రీకారంలా బ్రతకాలి

చిరునవ్వులతో బ్రతకాలి… శ్రీకారంలా బ్రతకాలి

గతమంతా కనుమరుగవుతున్నా… నిన్నటి స్వప్నం నిలవాలి

నీ సంకల్పం గెలవాలి…

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

ఆశే నిన్ను నడిపిస్తుంది.. ఆకాశానికి

ఆశే దారి చూపిస్తుంది… అవకాశానికి

ఆశే నీకు లక్ష్యం చేరే… అస్త్రం మిత్రమా

ఆశే నీకు ఆయువు పెంచే… అమృతం నేస్తమా

ఆశ వెంట ఆచరణుంటే… అద్భుతాలు నీ సొంతం

ఆదమరచి నిదురిస్తుంటే… అందదే వసంతం

నిప్పులే గుండెలో నిండుతున్నా… ఉప్పొంగే జలపాతం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి… చిగురాశలతో బ్రతకాలి

చిరునవ్వులతో బ్రతకాలి… చిగురాశలతో బ్రతకాలి

అంతిమ విజయం అనివార్యమని… ఆశిస్తూ నువు బ్రతకాలి

ఆశయాన్ని బ్రతికించాలి…

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

నీడే నిన్ను భయపెడితే… ఆ నేరం వెలుగుదా

నలుసే బాధపెడుతుంటే… ఆ దోషం కంటిదా

నేస్తం చూడు జీవితమంటే… నిత్యం సమరమే

సమరంలోనే కనుమూస్తే… ఆ మరణం అమరమే

పారిపోకు ఏ ఓటమికీ… ప్రపంచాన్ని విడిచి

జారిపోకు పాతాళానికి… బ్రతుకుబాట మరచి

వరదలా మృత్యువే తరుముతున్నా… ఆరని అగ్నిజ్వాలే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి… శిఖరంలా పెకైదగాలి

చిరునవ్వులతో బ్రతకాలి… శిఖరంలా పెకైదగాలి

చావుకు చూపే ఆ తెగింపుతో… జీవించాలనుకోవాలి

నువు జీవించే తీరాలి…

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

విజయం తలుపు తెరచేవరకూ… విసుగే చెందకు

విసుగే చెంది నిస్పృహతో… నీ వెనకే చూడకు

చిందే చెమటచుక్కకు సైతం… ఉందీ ఫలితమే

అది అందే వరకు సహనంతో… సాగాలి పయనమే

అంతరాత్మ గొంతే నులిమి… శాంతి కోరుకుంటావా

అల్లుకున్న అనుబంధాలే… తల్లిడిల్లిపోవా

అలజడే నిలువునా అలుముకున్నా… అలుపెరుగని చైతన్యం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

ఆనందాలను అన్వేషిస్తూ… అందరికోసం బ్రతకాలి

అందరినీ బ్రతికించాలి…

చిరునవ్వులతో బ్రతకాలి… చిరంజీవిగా బ్రతకాలి

[ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి]

సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి…

కానీ ప్రాణం పోతే తిరిగి రాదు

…. మీ శ్రోయోభిలాషి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Mee Sreyobhilashi Movie

  1. Chirunavvulatho Brathakali Song Lyrics

Chirunavvulatho Brathakali Song FAQ

What movie is Chirunavvulatho Brathakali song from?

Chirunavvulatho Brathakali song is from the Mee Sreyobhilashi movie.

Who sang Chirunavvulatho Brathakali song?

Chirunavvulatho Brathakali song was sung by S P Balasubramanyam.

Who wrote Chirunavvulatho Brathakali song lyrics?

Chirunavvulatho Brathakali song lyrics were written by Venigalla Rambabu.

Who composed music for Chirunavvulatho Brathakali song?

Chirunavvulatho Brathakali song music was composed by Koti.