
| Movie Name | Nalugu Stambhalata |
|---|---|
| Director | Jandhyala |
| Star Cast | Naresh, Poornima |
| Music | Rajan-Nagendra |
| Singer(s) | S P Balasubramanyam, P Susheela |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Saregama South |
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ… నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచిపోబోకుమా… మమత నీవే సుమా
చినుకులా రాలి… నదులుగా సాగి
వరదలై పోయి… కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ… నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి
నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై
తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే
నే వేచి ఉంటానులే
జన్మలు దాటె ప్రేమను నేనై
నే వెల్లువవుతానులే
హిమములా రాలి… సుమములై పూసి
ఋతువులై నవ్వి… మధువులై పొంగు
నీ ప్రేమ నా ప్రేమ… నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా… విడిచి పోబోకుమా
విరహమై పోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై… అల్లాడుతున్నానులే
పులకరమూగే పువ్వుల కోసం… వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే… ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై… నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి… గానమై పిలిచి
కలలతో అలిసి… గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ… తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా
ప్రేమమయమే సుమా
ప్రేమ మనమే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ నా ప్రేమ… నీ పేరే నా ప్రేమ
Chinukula Raali song is from the Nalugu Stambhalata movie.
Chinukula Raali song was sung by S P Balasubramanyam, P Susheela.
Chinukula Raali song lyrics were written by Veturi Sundararama Murthy.
Chinukula Raali song music was composed by Rajan-Nagendra.