
| Movie Name | Nee Sneham (2002) |
|---|---|
| Director | Paruchuri Murali |
| Star Cast | Uday Kiran, Arthi Agarwal, Jatin Grewal |
| Music | RP Patnaik |
| Singer(s) | Usha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఆఆ ఆ ఆఆఆ ఆఆ ఆ ఆఆఆ
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే
అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ ఆఆ ఆ, ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా
సరిగసా సరిగసా రిగమదని
సరిగసా సరిగసా నిదమదని
సాస నిని దాద మామ గమదనిరిసగా
నినిదద నినిదద నినిదద నినిదద
సగమగ సనిదని మద నిస నిస గసగా
పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ
పచ్చనైన వరిచేల సంపదలు
అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి
నీ లేత అడుగు తన ఎదను మీటి
నేలమ్మ పొంగెనమ్మా, ఆఆ
ఆఆ ఆ, ఆగని సంబరమా
ఆ ఆఆ ఆ… ఆగని సంబరమా
సగమగా రిస సనిదమగ సగ
సగమగా రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గనిస
సనిస సనిస నిస నిస నిస గనిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా
వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవీ కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా, ఆ ఆ
ఆఆఆ ఆ, రాముని సుమ శరమా
ఆఆఆ ఆ,రాముని సుమ శరమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా
మువ్వలే మనుసుపడు పాదమా
ఊహలే ఉలికిపడు ప్రాయమా
హిందోళంలా సాగే
అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా
ఆ ఆఆ ఆ, ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా
Chinuku Thadiki song is from the Nee Sneham movie.
Chinuku Thadiki song was sung by Usha.
Chinuku Thadiki song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Chinuku Thadiki song music was composed by RP Patnaik.