
| Movie Name | Dasara Bullodu |
|---|---|
| Director | V. B. Rajendra Prasad |
| Star Cast | ANR, Vanisri, Chandrakala |
| Music | KV Mahadevan |
| Singer(s) | Ghantasala, P Susheela |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు
చెరిగి పోవని… మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు
చెరిగి పోవని మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న ఊసులు
మాసి పోవనీ మారిపోవని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న ఊసులు
మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న
ఆటలకు అలుపు రానివ్వనని
పాడుకున్న పాటలు పాతబడి పోవనీ
చిలిపిగ ఆడుకున్న
ఆటలకు అలుపు రానివ్వనని
పడుచు గుండె బిగువులు
సడలి పోనివ్వనని
పడుచు గుండె బిగువులు
సడలి పోనివ్వనని
దుడుకుగ ఉరికిన పరువానికి
ఉడుకు తగ్గిపోదని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చెప్పుకున్న ఊసులు మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
మనకధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
కన్నెగా కన్నకలలు కధలుగా చెప్పాలి
మన కధ కలకాలం చెప్పినా కంచికెళ్ళకుండాలి
మన జంట జంటలకే కన్నుకుట్టు కావాలి
మన జంట జంటలకే కన్నుకుట్టు కావాలి
ఇంక ఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలై పొవాలి
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు
చెరిగి పోవని… మరచి పోనని
చేతిలో చెయ్యేసి చెప్పు రాధా
చెప్పుకున్న ఊసులు
మాసి పోవనీ మారిపోనని
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
Chethilo Cheyyesi Cheppu Bava song is from the Dasara Bullodu movie.
Chethilo Cheyyesi Cheppu Bava song was sung by Ghantasala, P Susheela.
Chethilo Cheyyesi Cheppu Bava song lyrics were written by Acharya Athreya.
Chethilo Cheyyesi Cheppu Bava song music was composed by KV Mahadevan.