
| Movie Name | Snehamante Idera (2026) |
|---|---|
| Director | Balasekharan |
| Star Cast | Nagarjuna, Bhoomika | |
| Music | Shivashankar |
| Singer(s) | Hariharan, Sujatha |
| Lyricist | Mryutyamjayudu |
| Music Label | Aditya Music |
చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తె సిగ్గులెందుకే
నీ నవ్వె సింగారమో...నీ పలుకే బంగారమో
నీ ముద్దో మందారమో...హో రోజా రా రా రా రా రా
ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే
మాటలన్ని మాయాచేసి ప్రేమకు వల వేసా
ప్రేమ మైకం పొందిన వేలా మౌనం సాదించా
కన్నులు నాల్గు కలిసినవేలా భాషకు చోటేదీ
మౌనం పాడే ఆలాపనకు మించించినదేముందీ
మాటలే మనసుకి బరువైతే
మౌనమే కానుక అవుతుందీ
మౌనమను భాషే రాకుంటే
ప్రేమ ఇక వ్యర్దం అవుతుందీ
ఈ ప్రేమ భావనే నిజం నిజం
ఏదొ చెపాలనే ఉందీ గుండె ఝల్లుమందీ
సిగ్గుని చెందని పువ్వుని తుమ్మెద అంటదులే
ముద్దును పొందని సిగ్గులో బుగ్గలు కందవులే
చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
ప్రేమ కానుక పొందిన వేలా సర్వం మరిచానూ
నా ప్రేమకు నిత్యం పాణం పోసి కవినై పోయానూ
తియ్యగ పలికిన స్వరమున జల్లున మనసే తడిసిందీ
నీకై నిలచీ నిన్నే తలచి పాణం ఇస్తుందీ
యవ్వనము వయసుకు తోడైతే
ఆశలకు పండుగ అవుతుందీ
ఆశలో స్వరం కనుగొంటే
జీవితం మధురసమవుతుందీ
ఇక ఊరించే ప్రియా ప్రియా
నీ అంద చందాలన్ని చూసి కల్లు చెదరే
మదిలో దాగిన ఊహలో ఊపిరి నీవైకరీ
వద్దని కన్నులు మూసినా ఎదుటే నీవుంటివీ
చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే
పెదవి మీద సిగ్గు లన్ని పైట చాటు దాచకే
ముద్దు కోరి చెంతకొస్తె సిగ్గులెందుకే
నీ నవ్వె సింగారమో...నీ పలుకే బంగారమో
నీ ముద్దో మందారమో...హో రోజా రా రా రా రా రా
చెలియా నీ ప్రేమలోనే పరవసించి పోయానే
Cheliya Nee Premalone song is from the Snehamante Idera movie.
Cheliya Nee Premalone song was sung by Hariharan, Sujatha.
Cheliya Nee Premalone song lyrics were written by Mryutyamjayudu.
Cheliya Nee Premalone song music was composed by Shivashankar.