
| Movie Name | Mallishwari |
|---|---|
| Director | K.Vijaya Bhaskar |
| Star Cast | Venkatesh, Katrina Khaif |
| Music | Koti |
| Singer(s) | K K & Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు
కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకూ
అన్నానంటే అన్నానంటావ్
అంతేగాని ఆలోచించవ్
నేనే కాదా నీకుండే దిక్కు
నాకోసం నువు పుట్టానంటావ్
నేనంటే పడి చస్తానంటావ్
నీకేంటంట నాపై ఈ హక్కు
ఇమ్మంటే ప్రాణం ఇస్తా, నమ్మవెందుకు
పొమ్మంటూ దూరం చేస్తావెందుకూ
చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు
నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు
చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
దగ్గరకొస్తే భగ్గంటున్నవ్
పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగే మరి
ఆవైపంటే ఈ వైపంటావ్
నే లెప్ట్ అంటే… నువ్ రైట్ అంటావ్
నీతో అన్నీ పేచీలే మరి
ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా..!
మాటల్తో మంత్రం వేస్తూ తియ్యగా
మైకంలో ముంచేస్తావు మెల్లమెల్లగా
చెలి సోకు లేత చిగురాకు… పలుకేమో కాస్త కరుకు
కవి కాళిదాసుననుకోకు… వలవేసి వెంటపడకు
ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
నీ వల్లే కాదా నాకీ చిక్కులు
కోపంలో కూడా ఎంత నాజూకు
Cheli Soku song is from the Mallishwari movie.
Cheli Soku song was sung by K K & Chitra.
Cheli Soku song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Cheli Soku song music was composed by Koti.