| Movie Name | Sri Krishna Pandaveeyam |
|---|---|
| Director | N T Rama Rao |
| Star Cast | N T Rama Rao, Varalakshmi |
| Music | T V Raju |
| Singer(s) | Jikki |
| Lyricist | C Narayana Reddy |
| Music Label | Saregama Telugu |
ఓహో హో ఓఓ ఓ ఓహో హో ఓఓ ఓ ఓఓ ఓ
చాంగురే చాంగు చాంగురే
చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా… మత్తైన వగకాడా, అయ్యారే
అయ్యారే, నీకే మనసియ్యాలని ఉందిరా
చాంగురే, చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
ముచ్చటైన మొలక మీసముంది
భళా, అచ్చమైన సింగపు నడుముంది
ముచ్చటైన మొలక మీసముంది
భళా, అచ్చమైన సింగపు నడుముందీ
జిగీ బిగీ మేనుంది… సొగసులొలుకు మోముంది
మేటి దొరవు అమ్మక చెల్లా
నీ సాటి ఎవ్వరునుండుట కల్ల
చాంగురే, చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు… పచ్చల పిడిబాకు
కైపున్న మచ్చకంటి చూపు
అది చూపు కాదు… పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో… విచ్చిన పువురేకో
గుచ్చుకుంటే తెలుస్తుందిరా, ఆ ఆఆ
మనసొచ్చుకుంటే తెలుస్తుందిరా, ఆ ఆ ఆ ఆ
చాంగురే, చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
గుబులుకొనే కోడెవయసు లెస్స
దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
గుబులుకొనే కోడెవయసు లెస్స
దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచుదనపు గిలిగింత… గడుసు గడుసు పులకింత
ఉండనీయవేమి సేతురా, ఆ ఆఆ
కై దండలేక నిలువలేనురా, ఆ ఆ ఆ ఆ
చాంగురే, చాంగురే బంగారు రాజా
చాంగు చాంగురే బంగారు రాజా
Changure Bangaru Raja song is from the Sri Krishna Pandaveeyam movie.
Changure Bangaru Raja song was sung by Jikki.
Changure Bangaru Raja song lyrics were written by C Narayana Reddy.
Changure Bangaru Raja song music was composed by T V Raju.