
| Movie Name | |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Chiranjeevi, Roja, Ramya Krishna, Nagma |
| Music | Vidyasagar |
| Singer(s) | S P Balasubramanyam & Chitra |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Lahari Telugu | T-Series |
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతిపూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ… అందీవే పాలబుగ్గ
అదిరిందయ్యో జబ్బ… నిన్నింక నేను ఒగ్గ
పుచ్చుకో పిల్లదానా… అదేదో ఇచ్చుకో కుర్రదానా
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
సిరిమల్లె మాల… సిగలో ముడిచేయ్నా
చెంగావి చీర సిగ్గే దోచేయ్నా
అడిగిందే చాలు… గురుడా పెనవేయ్నా
కౌగిట్లో చేరి కళలే కలబోయనా
సుడిరేగుతుందే సుఖమైన జ్వాల
మందార దీవుల్లో… ముత్యాల జల్లుల్లో
అబ్బాయి నాట్యమాడేస్తుంటే
అరెరెరెరె గిచ్చనా గొల్లభామ
ఎంచక్కా గుచ్చనా ఘాటు ప్రేమా
(జిగిజిగిజా జిగిజిగిజా జిగిజా)
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
సంపంగి మొగ్గ… శృతిలో సవరించు
అందాల బొమ్మ… ఇదిగో అలరించు
శృంగార వీణ సఖియా పలికించు
వయ్యారమంతా ఒడిలో ఒలికించు
మరుమల్లె వేళ… మదనాల గోల
పున్నాగ ఒంపుల్లో… సన్నాయి సొంపుల్లో
అమ్మాయి నన్ను దాచేస్తోంటే, హహహ హ్హా
హత్తుకో అందగాడా… మజాలే అందుకో చందురూడా
(జిగిజిగిజా జిగిజిగిజా జిగిజా)
చామంతి పువ్వా పువ్వా పువ్వా
నీకు బంతి పూల మేడ కట్టనా
రంగేళి రవ్వా రవ్వా రవ్వా
నా సోకులన్నీ రంగరించనా
ఓలమ్మో కన్నె మొగ్గ… అందీవే పాలబుగ్గ
అదిరిందయ్యో జబ్బ నిన్నింక నేను ఒగ్గ
అర్రె, పుచ్చుకో పిల్లదానా
అదేదో ఇచ్చుకో కుర్రదానా
Chamanthi Puvva Puvva song is from the movie.
Chamanthi Puvva Puvva song was sung by S P Balasubramanyam & Chitra.
Chamanthi Puvva Puvva song lyrics were written by Bhuvana Chandra.
Chamanthi Puvva Puvva song music was composed by Vidyasagar.