
| Movie Name | By Kalyani Malik And Sunitha, Kal |
|---|---|
| Director | BV Nandini Reddy |
| Star Cast | Naga Shourya, Malavika Nair |
| Music | Kalyani Malik |
| Singer(s) | Sunitha, Kalyani Malik |
| Lyricist | Lakshmi Bhoopal |
| Music Label | Madhura Audio |
శతమానం భవతి శతాయుః పురుష
శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి
చక్కందాల చుక్క… కుదిరిందే పెళ్లేంచక్క
రెక్కల గుర్రం రాజు… తరలొచ్చే వేగంగా
కుచ్చుల జల్లో పూలు… గుచ్చెత్తే గుమ్మందాలు
అవి పచ్చల బంగారాలు… సిరి మువ్వుల సందళ్ళు
అరె చేతుల గోరింటాకు బుగ్గల్లో ఎరుపెక్కింది
ఆ సిగ్గుల పేరే మందారమా
అరిటాకుల విస్తళ్ళన్నీ అథితుల్ని రమ్మన్నాయి
ఆ కమ్మని పిలుపే ఆహ్వానమా
సంతోషమే సంగీతమై కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై వైభోగమే
కలల కావేరి కన్నె గోదారి పల్లకిలోన రాగ
వలపు విలుకాడు వరునిగా మారి
వధువు చేయందుకోగా
పరికిణి బాల తరుణిగా మారే పసుపు పారాణితో
వేద మంత్రాలు మంగళాక్షతలు
నాదమే సాక్షిగా
పేగు బంధాలు వీడిపోతున్న
వేడుకే పెళ్లిగా
నొసట తిలకాన నిలిచి ఉన్నాడు
విష్ణువే వరుని తోడు
పసిడి బుగ్గల్లో బుగ్గ చుక్కల్లి
హరికి సిరితోడు నేడు
ఇరువురై పుట్టి ఒకరుగా మారు
బంధమే జీవితం
మూడు ముళ్ళేసి అడుగులేడేసి
జరిగె ఈ సంబరం
రామ దేవేరి సీత రామయ్య అర్ధనారీశ్వరం
సంతోషమే సంగీతమై కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై వైభోగమే
సంతోషమే సంగీతమై కళ్యాణమే
చిరునవ్వులే కోలాటమై వైభోగమే
Chakkandala Chukka song is from the By Kalyani Malik And Sunitha, Kal movie.
Chakkandala Chukka song was sung by Sunitha, Kalyani Malik.
Chakkandala Chukka song lyrics were written by Lakshmi Bhoopal.
Chakkandala Chukka song music was composed by Kalyani Malik.