Movie Name | KA (2024) |
---|---|
Director | SUJITH,SANDEEP |
Star Cast | KIRAN ABBAVARAM |
Music | SAM CS |
Singer(s) | SARATH SANTHOSH |
Lyricist | SANAPATI BHARADWAJ PATRUDU |
Music Label | SAREGAMA TELUGU |
చిత్రం: క (KA)
పాట పేరు: బుజ్జమ్మ (Bujjamma)
తారాగణం: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), రెడిన్ కింగ్స్లీ (Redin Kingsley), నయన్ సారిక (Nayan Sarika), అచ్యుత్ కుమార్ (Achyuth Kumar), తన్వీ రామ్ (Tanvi Raam) తదితరులు
గాయకులు: సంతోష్ (Santhosh)
సాహిత్యం: సనాపతి భరద్వాజ పాత్రుడు (Sanapati Bharadwaj Patrudu)
సంగీత దర్శకుడు: సామ్ సిఎస్ (Sam CS)
చిత్ర దర్శకత్వం: సుజిత్ & సందీప్ (Sujith & Sandeep)
కనులకు కానుకలా కనబడినావే
కొడవలి చూపులతో కలబడినావే
తలవగ నీవే కలవరమాయే
కలకల మాయే
ఓ బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు
బుజ్జమ్మాయి ఓ బుల్లమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలనే
భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
పలుకే ప్రశాంతమా
అందాల సత్యభామ భామ
అంతా నీ మహిమా
ఆ వంపు సొంపు లింపుగున్న వయ్యారీ
చెంపలోనే కెంపులున్న చింగారీ
దిష్టి చుక్క పెట్టుకోవే సింగారీ
సింగారీ…..
ముద్దు ముద్దు మాటలాడు చిన్నారీ
ముచ్చటైన రూపు నీది పొన్నారీ
ముగ్గులోకి దించి నన్ను ముంచావే
కావేరీ …..
హే కాపలాగ కాచుకున్న
కాలాన్ని కొల్లగొట్టు మాటలాడి వమ్మ
హే చూపురువ్వి చిచ్చురేపే
చందమామ వమ్మ
ఓ మిస్సమ్మాయి కస్సు బుస్సమ్మాయి
నీ రెండు కళ్ళు చూడగానే చిట్టి గుండె చిత్తు చిత్తు
మిస్సమ్మాయి కస్సు బుస్సమ్మాయి
యే గుట్టు రట్టు చెయ్యనట్టి కట్టు బొట్టు మీద ఒట్టు
మనసు నీదే నెరజాన
అందుకోవే నజరానా
నవ్వు పిట్ట నా మోము వాకిట వాలింది నీ వలెనే
భామ భామ
సత్యభామ సత్యభామ
సొగసే సుతారమ
సత్యభామ సత్యభామ
నడకే నిదానమా
సత్యభామ సత్యభామ
నన్నే వరించు మా