| Movie Name | Missamma Released Date (1955) |
|---|---|
| Director | LV Prasad |
| Star Cast | NTR, ANR, Savithri, Jamuna |
| Music | Saluri Rajeswara Rao |
| Singer(s) | AM Rajah, P Leela |
| Lyricist | Pingali Nagendra Rao |
| Music Label | Saregama Telugu |
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
ఎందుకె రాధా ఈశునసూయలు… అందములందరి ఆనందములే
ఎందుకె రాధా ఈశునసూయలు… అందములందరి ఆనందములే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
పిల్లనగ్రోవిని పిలుపును వింటే… ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లనగ్రోవిని పిలుపును వింటే… ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన… జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన… జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
రాసక్రీడల రమణుని గాంచిన… ఆశలు మోసులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన… ఆశలు మోసులు వేయవటే
ఎందుకె రాధా ఈసునసూయలు… అందములందరి ఆనందములే
బృందావనమది అందరిదీ… గోవిందుడు అందరివాడేలే
గోవిందుడు అందరివాడేలే
Brundavanamadi Andaridi song is from the Missamma Released Date movie.
Brundavanamadi Andaridi song was sung by AM Rajah, P Leela.
Brundavanamadi Andaridi song lyrics were written by Pingali Nagendra Rao.
Brundavanamadi Andaridi song music was composed by Saluri Rajeswara Rao.