
| Movie Name | Bobbili Raja (1990) |
|---|---|
| Director | B.Gopal |
| Star Cast | Venkatesh, Divya Bharati |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music Telugu |
చెమ్మచెక్క చెమ్మచెక్క
జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క నిమ్మచెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో
కోరింది కోసి అందుకో
రాణి ఐ లవ్ యూ
రాజా ఐ లవ్ యూ
చెమ్మచెక్క చెమ్మచెక్క
జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క నిమ్మచెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
మారుమూల సోకు చేర లేఖరాయనా
సరసాలు తోడు సంతకాలు తాకిచూడనా
తేరిపార చూడనీ… దోర ఈడునీ
చీర చూరు దాటనీ… వేడి ఊహని
వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోని
కళ్ళతోటి కత్తిరించు కన్నె కంచెలన్ని
రా గారంగా… సైరా సారంగా
చెమ్మచెక్క చెమ్మచెక్క
జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క నిమ్మచెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో
కోరింది కోసి అందుకో
రాణి ఐ లవ్ యూ
రాజా ఐ లవ్ యూ
ఈటెలాంటి నాటు చూపు నాటుకున్నది
అలవాటు లేని సాటు చోట మాటుకున్నది
ఈదలేను యవ్వనం ఆదరించవా
మీదవాలు మోజుతో స్వాగతించవా
రంగ రంగ వైభవాల… మంచమేలుకోవా
గంగ పొంగు సంబరాల… రంగు తేలనీవా
ఈ ఏకాంతం… కానీ కైలాసం
చెమ్మచెక్క చెమ్మచెక్క
జున్నుముక్క చెంపనొక్క
నిమ్మచెక్క నిమ్మచెక్క
నమ్మకంగ తిమ్మిరెక్క
కో అంది కోక ఎందుకో
కోరింది కోసి అందుకో
రాణి ఐ లవ్ యూ
రాజా ఐ లవ్ యూ
రాణి ఐ లవ్ యూ
రాజా ఐ లవ్ యూ
Bobbili Raja Movie song is from the Bobbili Raja movie.
Bobbili Raja Movie song was sung by S P Balasubramanyam, Chitra.
Bobbili Raja Movie song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Bobbili Raja Movie song music was composed by Ilayaraja.