
| Movie Name | Money |
|---|---|
| Director | Siva Nageswara Rao |
| Star Cast | J D Chakravarthy, Chinna, Jayasudha, Renuka, Brahmanandam, Kota |
| Music | M M Keeravani |
| Singer(s) | Sri & Chakravarthy |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Mango Music |
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ
భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ
సోలో బ్రతుకే సో బెటరూ
ఓయ్, భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ
భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ
సోలో బ్రతుకే సో బెటరూ
ఆలికి మెళ్ళో ముళ్ళేశానని
ఆనందించే మగవారు
ఆ తాడే తమ ఉరితాడన్నది
ఆలోచించక చెడుతారు
మొగుడయ్యే ముహూర్తమే
మగాడి సుఖాన ముగింపు చాప్టరు
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ
భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ
సోలో బ్రతుకే సో బెటరూ
ఇదిగో వెయిటరూ క్వాటర్
లూజుదేమైనా దొరుకుతుందా
వంటకని వైఫెందుకురా హోటళ్ళే చాలు
ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు
కోతికి ఉందా కోడికి ఉందా… ఈ పెళ్ళాచారం
జంటలు కట్టే జంతువులెరగవు… వెడ్డింగ్ విడ్డూరం
ఎందుకు మనకీ గ్రహచారం, అందుకని
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ
భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ
సోలో బ్రతుకే సో బెటరూ, అవును
చచ్చీ చెడి డే అండ్ నైటు చాకిరి చేస్తావు
తెచ్చినది డార్లింగ్ దెయ్యం చేతిలో పోస్తావు
బీడీ కోసం బీబీ ముందు దేహీ అంటావు
గాడిని దాటని గానుగ ఎద్దై బతికేం చేస్తావు
బాండేడ్ బానిసవౌతావు
పులి లాగే పెళ్ళికి కూడా లెటర్స్ రెండేరా
పర్వాలేదని పక్కకు వెడితే ఫలారమైపోరా
ఈది అమీను సద్దాం హుస్సేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో ఉన్నా పెళ్ళాం కన్నా డిక్టేటర్లట్రా
అంతటి డిక్టేటర్లట్రా, బాబోయ్
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ
భర్తగా మారకు బ్యాచిలరూ
షాదీ మాటే వద్దు గురూ
సోలో బ్రతుకే సో బెటరూ
Bhadram Be Careful Brotheru song is from the Money movie.
Bhadram Be Careful Brotheru song was sung by Sri & Chakravarthy.
Bhadram Be Careful Brotheru song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Bhadram Be Careful Brotheru song music was composed by M M Keeravani.