
| Movie Name | Kala Folk Songs (2025) |
|---|---|
| Director | L.Madhukar Nayak |
| Star Cast | Lasya Smiley & Chandra Prakash Chary |
| Music | Krishnudu |
| Singer(s) | VAGDEVI |
| Lyricist | Chandra Prakash Chary(cpc) |
| Music Label | Kala Folk Songs |
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెరిగెను నాలో భారం దయుంచమంటున్నా
కన్నోళ్ళమాటను దాటలేని ఓరాతి బొమ్మనురా
ఈరాత రాసిన విధాత భారం నాకంట జారెనురా
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెంచెను నాలో భారం దయుంచమంటున్నా
కన్నోళ్ళమాటను దాటలేని ఓరాతి బొమ్మనురా
ఈరాత రాసిన విధాత భారం నాకంట జారెనురా
ఈ కటిక చీకట్లొచేరి పోరాడినే ఓడినా
ఆసంగతే నీకు తెలిపే వీలంటు లేదేఎలా
శ్రీరాముడంటి మహరాజే రాజ్యాలు వదిలొచ్చినా
రావణుడిచెరలోని సీతై ప్రతిక్షణము విలపించినా
ప్రాణంగా ప్రేమించే శ్రీకృష్టుడే దొరికినా
రాతల్లో లేని రాధై జన్మంత దుఖ్ఖించినా
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెరిగెను నాలో భారం దయుంచమంటున్నా
ఆనిండు కళ్ళల్లొదాచి నన్నెంత ప్రేమించినా
ఈగుండె ఎడబాటు మరిచి బండల్లె నేనిలిచినా
నను కన్నవారింత పెంటి ఇష్టాలనే మరిచినా
కష్టాలనీ దాటలేక కన్నీరుగా మిగిలినా
కాపాడే కన్నపేగే కక్షంటు తరిమేసినా
రకక్షించే ప్రేమ బంధం శిక్షంటు వదిలేసెనా
భరించలేకున్నారా కన్నా క్షమించమంటున్నా
మరింత పెరిగెను నాలో భారం దయుంచమంటున్నా
కనురెప్పలల్లొ నను దాచి కన్నీళ్ళలో ముంచినా
కడదాక కడతెగని బ్రతుకై కలతల్లె నేమారినా
నా ఊపిరే నాకు బరువై శ్వాసన్నదే ఆడునా
నువులేని జన్మ ఒక శవమై క్షణక్షణము మరణించినా
పరదాలే దాటలేని పరిధుల్లొ నే పెరిగినా
వలలోనా చిక్కుకున్న చేపల్లె నేమారినా
BARINCHA LEKUNAANE PILLA song is from the Kala Folk Songs movie.
BARINCHA LEKUNAANE PILLA song was sung by VAGDEVI.
BARINCHA LEKUNAANE PILLA song lyrics were written by Chandra Prakash Chary(cpc).
BARINCHA LEKUNAANE PILLA song music was composed by Krishnudu.