| Movie Name | & English - Simha |
|---|---|
| Director | Boyapati Srinu |
| Star Cast | Nandamuri Balakrishna, Nayanatara, Sneha Ullal |
| Music | Chakri |
| Singer(s) | Hariharan & Kousalya |
| Lyricist | Chandra Bose |
| Music Label | Aditya Music |
బంగారుకొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
శ్వాశించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు… సాయంత్ర సరదాలు
ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడా
గోరంత విరహాలు… కొండంత మురిపాలు
జన్మంత జలసాలు… జరిపించు ఘనుడ
నీ అడుగుజాడ… అది నాకు మేడ
బంగారు కొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా… నీ రూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
ఈ మహారాజు చిరునవ్వులే
నా మణిహార మనుకొందున
ఈ వనరాణి కొనచూపులే
నా ధనధాన్యమనిపించనా
నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం
ఒడిలో గుడిలో వల్లించనా
నువ్వైనావే గాయత్రి మంత్రం
పగలు రేయి జపియించనా
నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు
నీవెంటే నామనుగడా… నీగుండె నా తలగడా
బంగారుకొండ మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా… నీరూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
నీ మీసాల గిలిగింతకే
ఆ మోసాలు మొదలాయేనా
నీ మునివేళ్ళ తగిలింతకే
ఆ మునిమాపు కదలాయేనా
నీకే నీకే సొగసాభిషేకం
నిమిషం నిమిషం చేయించనా
నీతో తనువు మనసే మమేకం
మనదోలోకం అనిపించనా
సంసార కావ్యాలు… సంస్కార కార్యాలు
కలగలుపు గుణవంతుడ
కలియుగపు భగవంతుడా
బంగారుకొండా మరుమల్లె దండ
మనసైన అండ నువ్వేరా
కనుపాప నిండా నీ రూపు నిండా
నా బ్రతుకు పండ రావేరా
Bangarukonda song is from the & English - Simha movie.
Bangarukonda song was sung by Hariharan & Kousalya.
Bangarukonda song lyrics were written by Chandra Bose.
Bangarukonda song music was composed by Chakri.