
| Movie Name | Rudraveena (2022) |
|---|---|
| Director | Madhusudan Reddy |
| Star Cast | Shreeram Nimmala, Elsa Ghosh, Shubasree |
| Music | Mahavir |
| Singer(s) | Abhay Jodhpurkar |
| Lyricist | Rambabu Gosala |
| Music Label |
నిన్నే నిన్నే చూస్తూ ఉండిపోయా
నీకే నీకే నేనే పడిపోయా
కాటుక కళ్ళతో వల విసిరి
చిలిపిగా మనసుని లాగావే
కొంటెగా నవ్వుతూ ఎద చేరి
ఊపిరి వేగం పెంచావే
బంగారు బొమ్మ
నువ్వే బంగారు బొమ్మ
నాకై బంగారు బొమ్మ
రావే నీదే ఈ జన్మ
నువ్వు నేను ఒకటవుతూ
మూడుముళ్లతో ముడి పడుతూ
ఏడు అడుగులు వేద్దామా, ప్రేమలో
ఒకరికి ఒకరుగా మనముంటు
ఇద్దరి లోకం ఒకటంటు
జతపడి చెరి సగమవుదామా, ఈ హాయిలో
తిట్టి కొట్టినా తట్టుకుంటా
కాలి పట్టిలా చుట్టుకుంటా
కంటి రెప్పలా కాచుకుంటా
విడిచి పెట్టనే ఒట్టు అంటా
బంగారు బొమ్మ
నువ్వే బంగారు బొమ్మ
నాకై బంగారు బొమ్మ
రావే నీదే ఈ జన్మ
రెండుకళ్ల వాకిట్లో… కలల కళ్ళాపి జల్లి
రంగుముగ్గులెట్టేసి వెల్లకే
చిట్టిగుండె కుండీలో… రోజుకొక్క రోజానే
ప్రేమతోటి పూయించి వదిలెళ్ళకే
మాటలాడుతూ నువ్వుంటే
నోటజారిన ముత్యాలే
పోగుజేసేలా నాతోనే
దాచుకుంటానే నే పదిలంగా
బంగారు బొమ్మ
నువ్వే బంగారు బొమ్మ
నాకై బంగారు బొమ్మ
రావే నీదే ఈ జన్మ
Bangaru Bomma song is from the Rudraveena movie.
Bangaru Bomma song was sung by Abhay Jodhpurkar.
Bangaru Bomma song lyrics were written by Rambabu Gosala.
Bangaru Bomma song music was composed by Mahavir.