Movie Name | Mension House Mallesh (2025) |
---|---|
Director | Bala Satish |
Star Cast | Srinath Maganti, Gayathri Ramana, Sai Kamakshi Bhaskarla, Rajhessh, Muralidhar Goud, Rajkumar Kasireddy, Sai Prasanna, Padma Nimmanagoti, Hari Rebel |
Music | Suresh bobbili |
Singer(s) | Harini ivaturi |
Lyricist | Saraswati putra Ramajogayya shastry |
Music Label | saregama Telugu |
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే… హొయ్
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…
నీ కొరకేగా నేను
నా కోసం నే లేను
పుడతానే నీ పెండ్లాలమై పుట్టేసాను..
నిన్ను దాటి పోలేను
నీ లోపట చేరాను
ఇక జనమ లెన్నైనా నీతోనే నేను…
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే…
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…హొయ్
నాకేమైన అయినదంటే తల్లడిల్లిపోయే నువ్వు
ఊపిరాపి ఉరకలు పెడతావు…
నొప్పి నాకు కలిగిందంటే కంట్లో నీటి చేరువైతావు
నన్ను తలచి నిద్దర చెడతావు…
ఎంత ఎంత ప్రేమను నువ్వు దాచినావు నా పైన
అంతకన్న మిన్నగా చూసుకోలేనా నిన్ను
కంటి రెప్ప కావాలిగా నా కలత నలత ఏదైనా
చంటి పాప నువ్వని అనుకుంటాను…
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే…
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…
ఒక్క నాకే సొంతం నువ్వు
కంటి పాప మొత్తం నువ్వు
ముప్పోద్దుల నీ మీదే ధ్యానం…
నడుం మీది మచ్చవు నువ్వు
గుండె మీది పచ్చవు నీవు
నీతో కలిసి పోయినది ప్రాణం…
ఒకరికొకరు నువ్వు నేను
రెండు జంట పావురాలు
మనకి మనం తోడై ఉంటే చాలు…
పనికి రావు నీకు నాకు లేనిపోని దూరాలు
చెరిసగాలు సరదాలు సరసాలు…
బంగారి బంగారి పెనీవిటి బంగారి
మెళ్ళో నల్లపూసై మెరిసావే…
ముక్కోటి దైవాల వారమై నన్ను చేరి
తల పాపిట కుంకుమ కురిసావే…