| Movie Name | |
|---|---|
| Director | Yandamuri Veerendranath |
| Star Cast | Chiranjeevi, Vijayashanti, Nirosha |
| Music | Ilayaraja |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా చెడింది నిద్దరా
వయస్సు ఒడ్డు దాటుతుంటే
మనస్సు అడ్డు చెప్పదాయే
వయస్సు ఒడ్డు దాటుతుంటే
మనస్సు అడ్డు చెప్పదాయే
కథేవిటే చెలీ.. ఇదేమి కౌగిళి
గులాబి మొగ్గలో గులేభకావళి
ఫలాన చోట అంటుకోనా
ఫలాల పంట అందుకోనా
ఫలాన చోట అంటుకోనా
ఫలాల పంట అందుకోనా
పిచ్చి ఎక్కి గాలి… గిచ్చి చంపుతుంటే
ఎక్కడో చిక్కడే సిగ్గుపాపా
గుచ్చి గుచ్చి చూసే… కన్ను గీటుతుంటే
ఎందుకో ఏమిటో చెప్పలేవా
వయ్యారి ఒంటికీ ఒత్తిడంత ఇష్టమో
ఆ కంటి చాటుకే రాలేవా
శృంగారవీణకి చీకటెంత ఇష్టమో
ఆ పొద్దు వాలితే వారెవ్వా
అందాల ఆరడి… అయ్యాక నే రెడి
అందాక తాకిడి… ఆపైన దోపిడీ
పాదాలు నేను దాచుకుంటా
ప్రాయాలు నేను దోచుకుంటా
భలేగ ఉందిరా
ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా
ముక్కుమీద కోపం… ముట్టుకోని రూపం
ఇక్కడే ఇప్పుడే అంటుకోనా
పక్కదిండు పాపం… చుక్కలమ్మ సాక్ష్యం
వద్దని వాయిదా వేసుకోనా
అమ్మాయి తీగరో… సన్నాయి నొక్కుతా
సంగీత నవ్వులే రావాలి
అబ్బాయి రాకతో… లల్లాయి పాటలో
గారాలఎంకినై పోవాలి
శ్రీకాముడీ గుడి… సింధూర పాపిడి
పట్టిందిలే రతి ప్రణయాల హారతి
గుప్పిళ్ళు విప్పుకోని పాప, హాహా
చప్పుళ్ళు చాలుగాని టాటా
కథేవిటే చెలీ.. ఇదేమి కౌగిళి
గులాబి మొగ్గలో గులేభకావళి
వయస్సు ఒడ్డు దాటుతుంటే
మనస్సు అడ్డు చెప్పదాయే
ఫలాన చోట అంటుకోనా
ఫలాల పంట అందుకోనా
Balega Undira song is from the movie.
Balega Undira song was sung by S P Balasubramanyam, Chitra.
Balega Undira song lyrics were written by Veturi Sundararama Murthy.
Balega Undira song music was composed by Ilayaraja.