Movie Name | Sundarakanda (2025) |
---|---|
Director | Venkatesh Nimmalapudi |
Star Cast | Rohit Nara, Sri Devi, Vriti Vaghani |
Music | Leon James |
Singer(s) | Sid Sriram |
Lyricist | Sri Harsha Emani |
Music Label | Saregama Telugu |
బహుసా బహుసా బహుసా
తరగతి గదిలో ఆగావా… ఓ మనసా
బహుసా బహుసా… మనసా
తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా
నీ చెంపలనే కెంపులతో
నింపావనుకున్నా… బహుసా
నువ్వు నచ్చేసా…
నీ చెక్కర మాటల్లో
నే చిక్కుకుపోయానని తెలుసా…
నన్నే ఇచ్చేసా…
ఎగిరే తారాజువ్వ
చూస్తే అది నీ నవ్వా
పొగిడే మాటలు
ఎన్నున్నా సరిపోవా…?
కళ్లతో నవ్వే కలువ
ఊహలకందని విలువ
ఓ కనికట్టల్లే ఏమ్మాయో చే–సా–వా
మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే…
మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరికి ఎటు చూడు
నువ్వే నువ్వే…
బహుసా బహుసా బహుసా
తరగతి గదిలో ఆగావా… ఓ మనసా
బహుసా బహుసా… మనసా
తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా
పలుకుల దారా… గుణగణమే ఔర
నలుగురిలో నడిచే ఓ తారా
తెలిసిన మేరా… ఒకటే చెబుతార
ఆలయమే లేని దేవతారా…
నీ లక్షణం చెప్పనీ
అక్షరాలేమైనా వద్ధింకా, నాకొద్ధింకా
ఏ వంకలు పెట్టలేనంతగా
నచ్ఛావే నెలవంకా
చాలే చాలింకా
మెలకువలో నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
తీరికనే ఇవ్వవే…
మెలకువలూ నువ్వే
ప్రతి కలలో నువ్వే
తమకంలో నువ్వే
చివరికి ఎటు చూడు
నువ్వే నువ్వే…
బహుసా బహుసా బహుసా
తరగతి గదిలో ఆగావా… ఓ మనసా
బహుసా బహుసా… మనసా
తిరిగొస్తూనే ఉంటానని నీకలుసా