Ay Pilla Song Lyrics - Love Story

Ay Pilla Song Lyrics - Love Story
Ay Pilla Song Lyrics: Ay Pilla is a Telugu song from the film Love Story starring Naga Chaitanya, Sai Pallavi, directed by Sekhar Kammula. "Ay Pilla" song was composed by Pawan Ch and sung by Haricharan. Lyrics were written by Chaithanya Pingali.

Ay Pilla Song Details

Movie NameLove Story
DirectorSekhar Kammula
Star CastNaga Chaitanya, Sai Pallavi
MusicPawan Ch
Singer(s)Haricharan
LyricistChaithanya Pingali
Music LabelAditya Music

Ay Pilla Song Lyrics in Telugu

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి

ఆడియో: ఆదిత్య మ్యూజిక్

ఏయ్ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా

రా రా.. కంచె దుంకి, చక చక ఉరుకుతు

ఆ.. రంగుల విల్లుని తీసి.. ఈ వైపు వంతెన వేసి.. రావా

ఎన్నో తలపులు, ఏవో కలతలు బతుకే పొరవుతున్నా

గాల్లో పతంగిమల్లె.. ఎగిరే కలలే నావి

ఆశనిరాశల ఉయ్యాలాటలు, పొద్దుమాపుల మధ్యే

నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే

నీతో ఇలా.. ఏ బెరుకు లేకుండా

నివ్వే ఇగ.. నా బతుకు అంటున్నా

నా నిన్న నేడు రేపు కూర్చి నీకై పరిచానే తలగడగా

నీ తలను వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిలమిల చూడే

వచ్చే మలుపులు, రస్తా వెలుగులు.. జారే చినుకుల జల్లే

పడుగూ పేకా మల్లె.. నిన్ను నన్ను అల్లే

పొద్దే తెలియక, గల్లీ పొడుగున.. ఆడే పిల్లల హోరే

నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే..

ఏయ్ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా

పారే నదై నా కలలు ఉన్నాయి చేరే దరే ఓ వెదుకుతున్నాయే

నా గుండె ఓలి చేసి, ఆచి తూచి అందించా జాతరలా

ఆ క్షణము చాతి పైన సోలి చూశా లోకం మెరుపుల జాడే

నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి.. నేలన కనిపిస్తుందే

మారే నీడలు గీసే.. తేలే బొమ్మలు చూడే

పట్నం చేరిన పాలపుంతలు.. పల్లెల సంతలు బారే

నాకంటూ ఉందింతే.. ఉందంతా ఇక నీకే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Love Story Movie

  1. Nee Chitram Choosi Song Lyrics
  2. Mutyala Chemma Chakka Song Lyrics
  3. EVO EVO Kalale Song Lyrics
  4. Ay Pilla Song Lyrics

Ay Pilla Song FAQ

What movie is Ay Pilla song from?

Ay Pilla song is from the Love Story movie.

Who sang Ay Pilla song?

Ay Pilla song was sung by Haricharan.

Who wrote Ay Pilla song lyrics?

Ay Pilla song lyrics were written by Chaithanya Pingali.

Who composed music for Ay Pilla song?

Ay Pilla song music was composed by Pawan Ch.