
| Movie Name | Mayalo (2022) |
|---|---|
| Director | Megha Mithra Pervar |
| Star Cast | Naresh Agastya, Bhavana Vazhapandal, Gnaneswari Kandregula |
| Music | Dennis Norton |
| Singer(s) | Sid Sriram & Brinda |
| Lyricist | Kadali |
| Music Label | Aditya Music |
తెలిసిందే తెలియందై
కథే మారిపోయెనే
మనకింకా మిగిలింది
ఎటూ కాని యాతనే
ఔనన్నా కాదన్నా కాలం సాగిపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఇప్పుడేమో లోలోన ప్రశ్న ఊరుకోదే
నాకే నేనే లేనే
గుండెలోన దాగున్న మాటలన్నీ
నేరుగానే నిలదీసాయే
ఓ ఓ, నిన్న మొన్న మామూలు నేను కానే
మారిపోయి వేరయ్యానే
నాపైనా ఇన్నాళ్ళు ఉన్నా
ఆ మేఘాలే తొలిగాయంటా
ఆకాశం రంగంత జారే
అద్దాలేవో పట్టిందటా
అవునన్నా కాదన్నా కాలం సాగిపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఔనన్నా కాదన్నా కాలం సాగిపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఇప్పుడేమో లోలోన ప్రశ్న ఊరుకోదే
నాకే నేనే లేనే
ఏదో ఏదో ఏమయ్యిందో
నాలోపలేదో ఓ కొత్త తీరే
పంతాలే పోయి… పందాలే మాని
నా ఇంకో నేనే… నన్నే చూసేనే
సరిపోతాయే గత గమ్యాలవే
తగు పాఠాలే మరుపే రావులే
ఇకపైన హాయిలే
తెలిసిందే తెలియందై
కథే నాది ఔననీ
ఇకపైనా మనలేనే పరాయైన పాత్రనై
ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే
దూరంగా నిల్చున్నా రేపే నాదే నాదే
ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే
దూరంగా నిల్చున్నా రేపే నాదే నాదే
ఇప్పుడిలా లోలోన
చిన్న నవ్వు చేరే
చాలే… ఇంతే చాలే
Avunanna Kaadanna song is from the Mayalo movie.
Avunanna Kaadanna song was sung by Sid Sriram & Brinda.
Avunanna Kaadanna song lyrics were written by Kadali.
Avunanna Kaadanna song music was composed by Dennis Norton.