| Movie Name | |
|---|---|
| Director | Gunasekhar |
| Star Cast | Mahesh Babu, Bhoomika |
| Music | Mani Sharma |
| Singer(s) | Hariharan & Shreya Ghoshal |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
ముత్తైదులంతా ముదమార ఈ బాలకి
మంగళ స్నానాలు చేయించరే
శ్రీరామ రక్షణని క్షీరాబ్ది కన్యకి
ముమ్మారు దిష్టి తీసి దీవించరే
మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది
మెడిసి పడే మదిలో సందడి మేళాలై మోగింది
నీకు నాకు ముందే రాసుంది జోడి
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరాహోరి బహు బాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
గెలిచానే నీ హృదయం
కలకాలం ఈ విజయం… నీతో పంచుకోనా
ప్రియురాలా నా ప్రాణం… నీ పాపిట సింధూరంగా నిలపనా
కలలన్నీ ఈ నిమిషం నిజమయ్యే సంతోషం నాలో దాచగలనా
దరిచేరే నీకోసం చిరునవ్వుల… నీరాజనం ఇవ్వనా
ముస్తాబు చెయ్యరటే… ఈ ముద్దుల గుమ్మకి
సిగ్గుపడు చెంపకి… సిరి చుక్క దిద్దరే
పట్టుచీర కట్టరటే… ఈ పుత్తడి బొమ్మకి
తడబడు కాళ్ళకి… పారాణి పెట్టరే
వగలన్నీ నిగనిగలాడవ… నన్నల్లే కౌగిళ్ళో
నగలన్నీ వెలవెలబోవా… చేరందే నీ ఒళ్ళో
నాకే సొంతంగాని నీ సొమ్ములన్నీ
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరాహోరి బహుబాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
ఒట్టేసి చెబుతున్నా కడదాకా… నడిపించే తోడై నేనున్నా
ఏడడుగుల పయనాన… ఏడేడు లోకాలైనా దాటనా
వధువై ఎదురొస్తున్నా వరమాలై.. ఎదపైన వాలే ముహూర్తాన
వరసయ్యే వలపంతా చదివిస్తా… వరకట్నంగా సరేనా
ముక్కోటి దేవతలు మక్కువగా కలిపారే
ఎన్నెన్ని జన్మలదో ఈ కొంగుముడి
ముత్యాల జల్లులుగా అక్షింతలు వేయ్యాలి
ముచ్చట తీరేలా అంతా రండీ
ఏనాడూ ఎవరూ చేరని ఏకాంతం వెతకాలి
ఏ కన్నూ ఎపుడూ చూడని లోకంలో బతకాలి
పగలు రేయి లేని జగమేలుకోని
హరిలో రంగా హరి వహ్వా అంటూ చూస్తోంది పందిరి
బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
అత్తారింటికి నిన్నెత్తుకు పోతానుగా
వచ్చానే హంస వైభోగంగా
కన్యాతనమిస్తా కళ్యాణం సాక్షిగా
దొరలా దోచుకుపో యమ దర్జాగా
Attarintiki Okkadu song is from the movie.
Attarintiki Okkadu song was sung by Hariharan & Shreya Ghoshal.
Attarintiki Okkadu song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Attarintiki Okkadu song music was composed by Mani Sharma.