Arupu Song Lyrics - & - Roll Rida Arupu, Lokam Mottham

Arupu Song Lyrics - & - Roll Rida Arupu, Lokam Mottham
Arupu Song Lyrics: Arupu is a Telugu song from the film & - Roll Rida Arupu, Lokam Mottham. "Arupu" song was composed by Kamran and sung by Manisha Eerabathini & Roll Rida. Lyrics were written by Krishna Kanth.

Arupu Song Details

Movie Name& - Roll Rida Arupu, Lokam Mottham
Director
Star Cast
MusicKamran
Singer(s)Manisha Eerabathini & Roll Rida
LyricistKrishna Kanth
Music Label

Arupu Song Lyrics in Telugu

పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని.

లోకం మొత్తం నాదే అసలు… నా లోపలె జీవం మొదలు

అయ్యా నేడే మీకే అలుసు… నా కోపమె మీకేం తెలుసు

పేగు పేగు నాతో కలిసి… నా నెత్తురె నీకే పంచి

పెంచా పెంచా… నాపై దుమికే ఈ రాక్షసుల…

అత్యాచారం చేసినోన్ని ఉరి తీయాలి… మెడ పట్టి గొంతు పిసికి కాలపెట్టాలి

నేను చెప్పేదంతా… లోకం మొత్తం వినపడాలి

నీ చెల్లి కోసం… ఏ రోజైనా నిలబడాలి

నేను పాడేది పాటనె కాదు… చిన్నారి మాటల్లే ఇవి

కన్నులు కళ్ళార తడి… కాపాడేదెవరు మరి

అమ్మాయిల వాకిళ్ళలోనే… సంకెళ్లు బంధించి మరి

రంగుల ముగ్గుల పొడి… రక్తంగ మారేనె పడి

మమ్మీ నువ్వు ఇంట్లో… వదిలేసి వెళితె

అంకుల్ నా చెయ్యి పట్టి… మీద మీద పడితే

ఏమని చెప్పను నేను… ఎవ్వరికి చెప్పను నేను

మీరే మీరే నేర్పించారు… పెద్దోళ్ళు దేవుళ్ళు అని

ఎందుకు మమ్మీ పుట్టించాడు… డాడీ నన్ను అసలు

వినాలనుకున్న నేను… చందమామ కథలు

ఆడపిల్ల బాధలన్నీ… చెప్పుకునే బదులు

పుట్టగానే చంపేసుంటె… తప్పుతుండె ఉసురు

చిన్న బట్టలేసుకుంటె… చంపేయ్యాల?

ఇంకెన్ని రోజుల్… దాచుకుంట ప్రాణం ఇలా

నేను చదువుకోవాలా… లేదా బడికెళ్లాలా

న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయానివాల…

విలేజ్ పిల్లాని కాలేజికెల్లాను… డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లు దాటాను

సిటీ కి రాగానే సీటీ లు కొట్టారు…

నల్లగున్నానని నేను… నవ్వులపాలయ్యాను

తల మీద చెయ్యివేసి… దీవించె గురువులు

నడుం మీద చెయ్య వేసి… కోరారు పరుపులు

జింక పిల్లలాగ నేను… తీసాను పరుగులు

చనిపోయిన కూడా… మీద పడ్డారు పురుగులు

ఎదో సాదిద్దామని క్లాస్సేస్ కి వెళ్తే…

ఓ వ్యక్తి లవ్వంటూ… నా వెంట పడెనె

చిన్నచూపు చూసి… నా చున్నీ లాగాడు

ఆసిడ్ దాడుల్లో… నా పేరెక్కించాడు

రోడ్డు మీద రేప్ చేసి… రోకల్ తో చంపారు

ఇది విన్న మా డాడీ… గుక్కపెట్టి ఏడ్చాడు

కాండిల్ పట్టుకొని… వాకింగ్ చేస్తారు

కాండిల్ ఆరిపోగానె… ఇంటికెళ్ళిపోతారు

లోకం మొత్తం నాదే అసలు… నా లోపలె జీవం మొదలు

అయ్యా నేడే మీకే అలుసు… నా కోపమె మీకేం తెలుసు

పేగు పేగు నాతో కలిసి… నా నెత్తురె నీకే పంచి

పెంచా పెంచా… నాపై దుమికే ఈ రాక్షసుల…

ఒరేయ్ అన్నయ్యా..!! నన్ను పెంచావుగా

నా పెళ్లి కోసం… బరువులెన్నో మోసావుగా

ఇల్లు వదిలి ఇంటిపేరు మార్చారుగా… ఐన ఏడ్పు కూడా నవ్వుతోనే దాచానురా

అమెరికా సంబంధం… అన్నారు మొదట్లొ

వెన్నంటే ఉంటాను… అన్నాడు అప్పట్లొ

అనుమానం పెట్టేసి… దాచాడు గుప్పెట్లొ

దెబ్బలన్ని కాచుకొని… ఏడుస్త చీకట్లొ

సారీ అన్నయ్యా..!

అది ఆయిల్ మరక కాదు… సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు

కుంటుతున్న అంటే నేను… కింద పడలేదు

కోడలనుకున్న కానీ… పనిమనిషిని నేను

నా కాలే కట్టి… గుడ్డ నోట్లో పెట్టి

కట్నం అంటూనె… క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి

ఎవరు భాద్యులు కారు… అని లెటరే రాసి

నా చేతిలో పెట్టి… ఫ్యానుకి ఉరి వేశారు… చేతులు దులిపేసారు

లోకం మొత్తం నాదే అసలు… నా లోపలె జీవం మొదలు

అయ్యా నేడే మీకే అలుసు… నా కోపమె మీకేం తెలుసు

పేగు పేగు నాతో కలిసి… నా నెత్తురె నీకే పంచి

పెంచా పెంచా… నాపై దుమికే ఈ రాక్షసుల…

భయపడి, తలదించి… కాళ్ళమీద పడకు

ఎగబడు, తన్ను వాన్ని… బలిసిందారా బాడకౌ

ప్యాంటు జిప్పు విప్పగానే… మొగాడు కాదు

గల్లా పట్టి కొట్టుడు కొట్టు… జోలికసల్ రాడు

Listen this Song in Online!

Share this Song!

More Songs from & - Roll Rida Arupu, Lokam Mottham Movie

  1. Arupu Song Lyrics

Arupu Song FAQ

What movie is Arupu song from?

Arupu song is from the & - Roll Rida Arupu, Lokam Mottham movie.

Who sang Arupu song?

Arupu song was sung by Manisha Eerabathini & Roll Rida.

Who wrote Arupu song lyrics?

Arupu song lyrics were written by Krishna Kanth.

Who composed music for Arupu song?

Arupu song music was composed by Kamran.