
| Movie Name | Appudu Ippudu |
|---|---|
| Director | Chalapathi Puvvala |
| Star Cast | Srujan, Thanishq Rajan, Sivaji Raja |
| Music | Padmanav Bharadwaj |
| Singer(s) | Srikrishna Vishnubhotla |
| Lyricist | Chirravuri Vijaykumar |
| Music Label | Aditya Music |
అపుడు ఇపుడొక నాటకం
తపనలిపి ఒక నాటకం
మనిషి కృషి ఒక నాటకం
గురువు ఎశమొక ఒక నాటకం
శిలలో కళలని… మనసులో కడలిని
మెరుపులా నడుపు సమయము… గమనమే నాటకము
కఠినపరిశ్రమ ఘటనే నటనై… ఉరికి నరనరము
సెగలసడివై రగులు రవివై… పవనపదమై రుధిర రధమై
జానపదకల జ్వలనమై… గతము గరలమే నిలిపి
గలమున గెలువు నటనటరాజువై
అపుడు ఇపుడొక నాటకం
తపనలిపి ఒక నాటకం
మనిషి కృషి ఒక నాటకం
గురువు ఎశమొక ఒక నాటకం
ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
భరత ఘనతల గాన కవితల… నాధమే నాటకం
భవిత శృతిలయ ప్రాణరసమయ వేదమే నాటకం
వేదనే శోదనై… స్వేదమే సాదనై
అలసటే అశ్వమై… అణువు అణువొక విశ్వమై
చినుకు తడిపిన ఎండ నదివలే
నిండిపోని లో నువే
దిశలు ఎరుగని దీక్షనటనతో నింగిశికరమువై
ఇన్నాళ్ల చెడునిక చెరపగ… ఇన్నేళ్ల చెలిమిని కలపగ
ఇరుగ్రామాన్నొకటిగా చేసే ఈ నాటకం
ఎన్నెనో కలతలు మరువగ… వెన్నెల్లో వెలుగులు కురవగ
చిరకాలం గురుతుఉండాలీ నాటకం
కలల చిగురుల కళ్ళు చెమరిన ప్రేమయే నాటకం
కలహ చెదలకు ఊళ్లు చెదిరిన దూరమే నాటకం
విఫలమే సఫలమై… సమరమే అమరమై
వలపనీ త్యాగమే… కలగనే అనురాగమే
సహనమెరుగని భగ్న బ్రతుకులు దగ్గరయ్యేదీ ఎన్నడో
గ్రహణమిడిచిన అగ్ని ప్రేమకు అర్చనే ఎప్పుడో
ప్రేమిస్తే చుక్కలు పిలుచును… ప్రేమిస్తే రెక్కలు మొలుచును
ఎడబాటే ఎదబాటయ్యే నాటకం
ప్రేముంటే చీకటి వెలుగులు… ప్రేముంటే ఓటమి గెలుచును
మృత్యువునే బ్రతికిస్తుందీ నాటకం
Appudu Ippudu song is from the Appudu Ippudu movie.
Appudu Ippudu song was sung by Srikrishna Vishnubhotla.
Appudu Ippudu song lyrics were written by Chirravuri Vijaykumar.
Appudu Ippudu song music was composed by Padmanav Bharadwaj.