
| Movie Name | Additional SP Saritha Vaddhuraa Ann |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | K.G.V. Saritha (Additional SP, CID, AP Police) |
| Lyricist | |
| Music Label |
వద్దురా అన్నా… బయటకు రాకురోయన్న…
వద్దన్నా నువ్వు వస్తే… కాటేస్తుంది కరోనా…
అరరె.. వద్దురా అన్నా… బయటకు రాకురోయన్న…
మా తుపాకులు చెప్పలేదు మాయదారి కరోనాని…
అణు ఆయుధాలు అణచలేవు… కరుడుకట్టిన కరోనాని…
వద్దోయమ్మా…! బయటకు రావొద్దోయమ్మా…!
వద్దో అన్నా ..! బయటకు రావొద్దో అన్నా ..!
చేయి చేయి నువ్వు కలిపితే… యముడే నిను పిలుచునే…
కాదని కాలు బయట పెట్టినా… కరోనా కాటేయునులే…
మందే లేని మహమ్మారి ఈ కరోనా…
ప్రళయంలా ముంచుకొస్తుంది ఎవ్వరిని మింగుదునా అని…
వద్దోయమ్మా…! బయటకు రావొద్దోయమ్మా…!
వద్దో అన్నా ..! బయటకు రావొద్దో అన్నా ..!
చేతులెత్తి మొక్కుతున్నా… దండం పెట్టి చెబుతున్నా…
నీ సరదాలకు, షికార్లకు బయటకు రాకు.. ఓ యువతా… ! ||2||
మీ ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డుగా పెడుతున్న…
కంటికి నిద్దురే లేకున్నా మీకు కాపలా మేము కాస్తున్నాం…
మీ కుటుంబాలతో మీరుంటే… మేము రోడ్లపైన తిరుగుతున్నాం…
వద్దోయమ్మా…! బయటకు రావొద్దోయమ్మా…!
వద్దో అన్నా ..! బయటకు రావొద్దో అన్నా ..!
రక్షక భటులం మేమున్నాం… మీకు ప్రాణరక్షణను కల్పిస్తాం…
కనపడని ఆ శత్రువుపై… మీతో కలసి విజయం సాధిస్తాం…
మీరే మా సైన్యం… సైన్యం… ఇంటిలో ఉండే పోరాటం…
మీరే మా ఆయుధం… ఆయుధం…
మీరు బయటకు రాకుంటే విజయం…
ఉన్నాం.. మేమున్నాం… మీకు అండగా…
జయిస్తాం.. జయిస్తాం… మహమ్మారిని అంతం చేద్దాం…
ఈ మహమ్మారిని అంతం చేద్దాం… ఈ మహమ్మారిని అంతం చేద్దాం…
AP Police Corona Virus song is from the Additional SP Saritha Vaddhuraa Ann movie.
AP Police Corona Virus song was sung by K.G.V. Saritha (Additional SP, CID, AP Police).