
| Movie Name | & English - Aahuthi |
|---|---|
| Director | Kodi Ramakrishna |
| Star Cast | Dr Rajashekar, Jeevitha |
| Music | Chellapilla Sathyam |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | M S Reddy |
| Music Label | Saregama Telugu |
ఆఆ ఆ ఆ ఆ ఆఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
అందమైన నా ఊహల మేడకు… ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు… ఆమే ప్రతి రూపం
ఆ తలపే నా ధ్యానం… ఆ అభినవ దేవత నా ప్రాణం
అందమైన నా ఊహల మేడకు… ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు… ఆమే ప్రతి రూపం
మల్లెపూల కన్నా… మంచు పొరల కన్నా
నా చెలి ముసిముసి నవ్వులు అందం
ఆ, నెమలి హొయలకన్నా
సెలయేటి లయల కన్నా
నా చెలి జిలిబిలి నడకలు అందం
అపురూపం… ఆ నవ లావణ్యం
అపురూపం… ఆ నవ లావణ్యం
అది నా మదిలో… చెదరని స్వప్నం
అందమైన నా ఊహల మేడకు… ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు… ఆమే ప్రతి రూపం
పైడి బొమ్మ లాంటి… ఆమె పక్కనుంటె
పగలే వెన్నెల నే కురిపిస్తా
ఆ ఆ, నీడ లాగ నాతో
ఏడడుగులు సాగితే
ఇలలో స్వర్గం… నే సృష్టిస్తా
రసరమ్యం… ఆ రాగ విలాసం, ఆ ఆఆ
రసరమ్యం ఆ రాగ విలాసం
వసివాడదు అది ఆజన్మాంతం
అందమైన నా ఊహల మేడకు… ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు… ఆమే ప్రతి రూపం
ఆ తలపే నా ధ్యానం… ఆ అభినవ దేవత నా ప్రాణం
అందమైన నా ఊహల మేడకు… ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు… ఆమే ప్రతి రూపం
Andamaina Naa Oohala song is from the & English - Aahuthi movie.
Andamaina Naa Oohala song was sung by S P Balasubramanyam.
Andamaina Naa Oohala song lyrics were written by M S Reddy.
Andamaina Naa Oohala song music was composed by Chellapilla Sathyam.