
| Movie Name | & English - Donga |
|---|---|
| Director | K Kodandarami Reddy |
| Star Cast | Chiranjeevi, Radha |
| Music | Vidyasagar |
| Singer(s) | S P Balasubramanyam & S Janaki |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు… నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే, ఏ ఏఏ ఏ
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
తెల్లచీర ఇచ్చుకో… మల్లెపూల వేళలో, (లాలాలాల ల)
సన్నకాటుకిచ్చుకో… సందె చీకటేళలో, (లాలాలాల ల)
కదలి వచ్చే నీలో… కడలి పొంగులు చూశా
కనుల నీడలలోనే… కవితలెన్నో రాశా, ఆహా హా
కొత్త మోజుల మత్తు గాలికి
సొగసు ఊపిరి పోసుకున్నది
రాగాలెన్నో నీలో రేగే వేళా
అందమా అలా అలా
అల్లుకో ఇలా ఇలా
కొమ్మ రెమ్మ సందుల్లో
మావిళ్ళ విందులో, (లాలాలాల ల)
కోకిలమ్మ వీధుల్లో
రాగాల చిందులు , (లాలాలాల ల)
రామచిలకలు తెచ్చే… చిగురు లేఖలు చూశా
చిగురు వేసిన ప్రేమా… నీకు కానుక చేశా
మండు వేసవి మల్లెలావిడి
పండు వెన్నెల పడుచు ఊపిరి
నీలో నాలో ఊయ్యాలూగే వేళా
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
కవ్వించే నీ కళ్ళు… నువ్విచ్చే కౌగిళ్ళు
నూరేళ్ళు నావేనులే, ఏ ఏఏ ఏ ఎహేయ్
అందమా అలా అలా… అల్లుకో ఇలా ఇలా
Andama Ala Ala song is from the & English - Donga movie.
Andama Ala Ala song was sung by S P Balasubramanyam & S Janaki.
Andama Ala Ala song lyrics were written by Veturi Sundararama Murthy.
Andama Ala Ala song music was composed by Vidyasagar.