| Movie Name | |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | ANR, Dasari Narayana Rao, Jayasudha, Rambha |
| Music | Raj-Koti |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ… ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ… ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం… ఎదనిండా మకరందం
అమ్మంటే… ప్రేమకు రూపం
నాన్నంటే… ఆమెకు దీపం
తోడునీడ తోటలో… తోటమాలి సేవలో
పువ్వులారబోసుకున్నా యవ్వనాలలో
ముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గు
ఇల్లు తెల్లారి… పెట్టుకున్న ముగ్గు
వాంఛ రెట్టింపు… చేసుకున్న వద్దు
కొత్త దాంపత్య భావాలు విద్దు
పాల మీద మల్లెపూలు… పంచుకున్నా జీవితాలు, ప్రేమలో
ఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం
అమ్మంటే… ప్రేమకు రూపం
నాన్నంటే… ఆమెకు దీపం
బాటసారి యాత్రలో… బారసాల ఈ దినం
కోకిలమ్మ పాడుతున్న జోల పాటలో
పుల్ల మావిల్లు… తీపి తేనె కన్నా
మల్లెపూలేమో ముళ్ళు పక్కలోన
కల్పవృక్షాన్ని నిన్ను కట్టుకున్నా
వంశవృక్షాన్ని నేను పెంచుకున్నా
జంటలైన పావురాలు… కలలుగన్న కాపురాల జోరులో
ఎన్నటిదో అనుబంధం… ఎదనిండా మకరందం
అమ్మంటే ప్రేమకు రూపం
నాన్నంటే ఆమెకు దీపం
సతి అంటే సహకారం
మగడంటే మమకారం
ఇల్లు స్వర్గసీమ… ఇంటిపేరు ప్రేమ
ఇల్లు స్వర్గసీమ… ఇంటిపేరు ప్రేమ
ఎన్నటిదో అనుబంధం… ఎదనిండా మకరందం
అమ్మంటే… ప్రేమకు రూపం
నాన్నంటే… ఆమెకు దీపం
Ammante Premaku Roopam song is from the movie.
Ammante Premaku Roopam song was sung by S P Balasubramanyam, Chitra.
Ammante Premaku Roopam song lyrics were written by Veturi Sundararama Murthy.
Ammante Premaku Roopam song music was composed by Raj-Koti.