| Movie Name | & English - Joruga Husharuga |
|---|---|
| Director | Anu Prasad |
| Star Cast | Viraj Ashwin, Pujitha Ponnada, Soonu Thakur |
| Music | Praneeth Muzic |
| Singer(s) | Arjun Kanungo |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label |
నీ చూపులను నీ మాటలను
దాచేంత చోటే ఉందా..?
సరిపోదే మనసంతా, ఎల్లా..?
నీ నవ్వులను… నీ సిగ్గులను
పోల్చేంత మాటే ఉందా..?
సరిపోదే తెలుగంత, ఎల్లా..?
హయ్యయ్యో, భాషకే ఇక మాటలే
లేవు అంటూ ఉందే
ఏమాత్రం చాలదే
నిను పోల్చగా పోలికే
దూరంగా దాక్కొని నిను చూడగా
చాలా అంటూ ఉందే
నా గుండె ఈపైన మైకంలోనే ఊరేగిందే
అలవాటో పొరపాటో
పొరపాటే అలవాటయ్యిందో
పగలైనా కలలన్ని నిద్ర పోవే
నిలదీసి అడిగాక
నిన్నే దాచి ఊరించేటి
కాలాన్నే బుద్దిలేదందే
దేవుడే నిన్ను చేసి
ఆగిపోయాడు చూసి
నిన్ను పంపాలో మానాలో
ఈ నేలకేసి..!
వెన్నెలే దారి కాసి
తాకితే నిన్ను చూసి
జైలులో పెట్టి బందిస్తా
సంకెళ్లు వేసి
నీ ఊపిరి మోసిన… గాలికిక ఊపిరాడదే
గుప్పెట మూసి నే బంధించగా
ఇప్పుడిక సంతకం లేనిదే
చెల్లని చెక్కు మాదిరే
జీవితం మారెనే నీవల్లనే
అలవాటో పొరపాటో
పొరపాటే అలవాటయ్యిందో
పగలైనా కలలన్ని నిద్ర పోవే
నిలదీసి అడిగాక
నిన్నే దాచి ఊరించేటి
కాలాన్నే బుద్దిలేదందే
నీ చూపులను నీ మాటలను
దాచేంత చోటే ఉందా..?
సరిపోదే మనసంతా, ఎల్లా..?
నీ నవ్వులను… నీ సిగ్గులను
పోల్చేంత మాటే ఉందా..?
సరిపోదే తెలుగంత, ఎల్లా..?
అలవాటో పొరపాటో
పొరపాటే అలవాటయ్యిందో
పగలైనా కలలన్ని నిద్ర పోవే
నిలదీసి అడిగాక
నిన్నే దాచి ఊరించేటి
కాలాన్నే బుద్దిలేదందే
Alavato Porapato song is from the & English - Joruga Husharuga movie.
Alavato Porapato song was sung by Arjun Kanungo.
Alavato Porapato song lyrics were written by Kittu Vissapragada.
Alavato Porapato song music was composed by Praneeth Muzic.