| Movie Name | & English - Manasantha Nuvve |
|---|---|
| Director | V. N. Aditya |
| Star Cast | Uday Kiran, Rima Sen |
| Music | RP Patnaik |
| Singer(s) | K K & Sujatha |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Aditya Music |
ఆకాశాన ఎగిరే మైనా… నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది… ఎంత ఆపుతున్నా
పిల్లగాలితో తూగుతున్నది… వింత హాయిలోన
ఆకాశాన ఎగిరే మైనా… నీతో రానా ఊహల పైనా
అటు ఇటు తిరుగుతూ కన్నులు
చిలిపి కలలను… వెతుకుతూ ఉన్నవి
మదిని ఊరించు… ఆశని కలుసుకోవాలనో
మధురభావాల ఊసుని… తెలుసుకోవాలనో
ఆకాశాన ఎగిరే మైనా… నీతో రానా ఊహల పైనా
తడబడు తలపుల అల్లరి ముదిరి
మనసును తరుముతూ ఉన్నది
అలలుగా తేలి నింగినీ పలకరించేందుకో
అలసటే లేని ఆటలో… అదుపు దాటేందుకో
ఆకాశాన ఎగిరే మైనా నీతో రానా ఊహల పైనా
అడుగు నేలపై ఆగనన్నది… ఎంత ఆపుతున్నా
పిల్లగాలితో తూగుతున్నది… వింత హాయిలోనా
ఆకాశాన ఎగిరే మైనా… నీతో రానా ఊహల పైనా
Akasana Egire Maina song is from the & English - Manasantha Nuvve movie.
Akasana Egire Maina song was sung by K K & Sujatha.
Akasana Egire Maina song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Akasana Egire Maina song music was composed by RP Patnaik.