
| Movie Name | (1959) |
|---|---|
| Director | Adurthi Subba Rao |
| Star Cast | ANR, Savitri |
| Music | Master Venu |
| Singer(s) | Ghantasala, Susheela |
| Lyricist | Sri Sri |
| Music Label | Saregama Telugu |
ఒఓఒ ఓ ఓఒ ఓ ఓఓఓ ఓఓ ఒఓఒ ఓఓఓ
ఆకాశ వీధిలో… అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే
ఆకాశ వీధిలో… అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే
ఆకాశ వీధిలో… అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే
జలతారు మేలి మబ్బు
పరదాలు నేసీ… తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి
పంతాలు పోయి… పందాలు వేసి
అందాల చందమామ
దొంగాటలాడెనే… దోబూచులాడెనే
ఆకాశ వీధిలో… అందాల జాబిలి
ఒయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే
ఆఆఅ ఆఆ ఆఆ… ఓఓఒ ఓఓ ఓఒ
ఆఆఅ ఆఆ ఆఆ… ఓఓఒ ఓఓ ఓఒ
జడివాన హోరుగాలి
సుడిరేగిరానీ… జడిపించబోనీ
కలకాలము నీవే నేనని
పలు బాసలాడి చెలి చెంత చేరి
అందాల చందమామ
అనురాగం చాటెనే… నయగారం చేసెనే
ఆకాశ వీధిలో అందాల జాబిలి
ఒయ్యారి తారను చేరి
ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
ఆఆఅ ఆఆ ఆఆ… ఓఓఒ ఓఓ ఓఒ
ఆఆఅ ఆఆ ఆఆ… ఓఓఒ ఓఓ ఓఒ
ఆకాశ వీధిలో
దడదడ ఉరుములు మ్రోగెనే
జడివాన ముంచుకొచ్చి
వడగండ్లు రాలెనే… కడగండ్లు కల్గెనే
జడివాన ముంచుకొచ్చి
వడగండ్లు రాలెనే… కడగండ్లు కల్గెనే
ఆకాశ వీధిలో
దడదడ ఉరుములు మ్రోగెనే మ్రోగెనే
జడివాన ముంచుకొచ్చి
వడగండ్లు రాలెనే… కడగండ్లు కల్గెనే
Akasa Veedhilo song is from the movie.
Akasa Veedhilo song was sung by Ghantasala, Susheela.
Akasa Veedhilo song lyrics were written by Sri Sri.
Akasa Veedhilo song music was composed by Master Venu.