| Movie Name | (Bombay Priyudu) In & English |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | JD Chakravarthy, Rambha |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Chitra |
| Lyricist | Chandra Bose |
| Music Label |
మ్ మ్ ఆఆ ఆఆ ఆ ఆ, అహో ప్రియా..!
క్యా బాత్ బోల చిడియా
మేరా దిల్ పిత్తర్ పిత్తర్ హోగయా
అయ్యయ్యో మిమ్మల్ని కాదండీ
నేను నేనేదో సరదాగ రాసుకున్న పాట
ప్రాక్టీస్ చేసుకుంటున్నానంతే… అంతే అంతేనండి
అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన… పిలుపు వేరే ఉందా
అహొ, అహొ… అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న… మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా… అనే జవాబు తానివ్వదా
అహొ, అహొ… అహో ప్రియా
రాగమంటు ఏమిటుంది… అనురాగమను పాటకీ
తాళమంటు ఏమిటుంది… పెనవేసుకొను ఆటకీ
మూగసైగ కన్న మంచి పలుకు ఏముందీ
ముద్దు కన్న పెద్దదైన… కవిత ఏముందీ
జంటకోరే గుండెలన్నీ… ఒక్కటే భాషలో దగ్గరౌతున్నవీ
కౌగిళించవా ప్రియా ప్రియా… అనేటి భావం అదీ
అహొ అహొ… అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన… పిలుపు వేరే ఉందా
అహొ అహొ అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న… మనసు ఆగుతుందా
తీయనైన స్నేహముందీ… విరిసేటి పూలతీగలో
తీరిపోని దాహముంది… తిరిగేటీ తేనే టీగలో
పూల బాల పరిమళాల… కబురు పంపిందీ
తేనెటీగ చిలిపి పాట… బదులు పలికింది
ఎన్ని సార్లో విన్నదైనా… ఎందుకు ఎప్పుడూ కొత్తగా ఉంటది
కౌగిళించవా ప్రియా ప్రియా… అనేటి ఆ సంగతీ
అహొ అహొ… అహో ప్రియా
ఇంతకన్న తియ్యనైన… పిలుపు వేరె ఉందా
అహొ అహొ… అహో ప్రియా
అంత మంచి పిలుపు విన్న… మనసు ఆగుతుందా
కౌగిళించవా ప్రియా… అనే జవాబు తానివ్వదా
అహొ అహొ… అహో ప్రియా
Aho Priya song is from the (Bombay Priyudu) In & English movie.
Aho Priya song was sung by S P Balasubramanyam, Chitra.
Aho Priya song lyrics were written by Chandra Bose.
Aho Priya song music was composed by M M Keeravani.