
| Movie Name | Geeta Sakshigaa |
|---|---|
| Director | Anthony Mattipalli |
| Star Cast | Aadarsh, Chitra Sukla |
| Music | Gopi Sundar |
| Singer(s) | Amrutha Suresh & Sri Krishna |
| Lyricist | Rahman |
| Music Label |
Adugulo Adugunai Lyrics in Telugu
అడుగులో అడుగులే వేయనా
కనులలో వెలుగులే పూయనా
అరచేతిలోన చెయ్ వేసి
విడిపోని చూపు ముడివేసి
వదలనే వదలకా కలలు కన్న కన్నె వలై
మనసునే తడపనా చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
నవ్వించి కవ్వించి ఉయ్యాలే ఊగించే
చెలినై చెలిమై
పొద్దున్నే ముద్దిచ్చి అందంగా లాలించి
సిరినై వరమై
మూడోకన్ను చూడని లోకంలో
ముచ్చటైన అల్లరి ఆటల్లో
అల్లుకున్న రేపటి ఆశల్లో
చివరి దాకా నే నిలబడనా
వదలనే వదలకా కలలు కన్న కన్నె వలై
మనసునే తడపనా చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
పూవుల్లో తేనెల్లా పాలల్లో నీళ్ళలా కలిసి మురిసి
చీకట్లో వెన్నెల్లా ఎండల్లో నీడలా జతగా నిలిచి
మంచుపూల చల్లని రాత్రుల్లో మత్తుజల్లె వెచ్చని ఊహల్లో
అంతులేని తియ్యని మాటల్లో చలిలో దుప్పటై జతపడనా
వదలనే వదలకా కలలు కన్న కన్నె వలై
మనసునే తడపనా చిలిపి చిందులేసే అలై
అడుగులో అడుగులే వేయనా
కనులలో వెలుగులే పూయనా
అరచేతిలోన చెయ్ వేసి
విడిపోని చూపు ముడివేసి
గతమునే మరచిన మనసు తేలుతుంటే కలై
జగమునే గెలవనా చెలిమి పంచుకున్న జతై
Adugulo Adugunai song is from the Geeta Sakshigaa movie.
Adugulo Adugunai song was sung by Amrutha Suresh & Sri Krishna.
Adugulo Adugunai song lyrics were written by Rahman.
Adugulo Adugunai song music was composed by Gopi Sundar.