
| Movie Name | Cobra (2022) |
|---|---|
| Director | Ajay Gnanamuthu |
| Star Cast | Chiyaan Vikram, Srinidhi Shetty, Irfan Pathan |
| Music | AR Rahman |
| Singer(s) | Haripriya, Nakul Abhyankar |
| Lyricist | Rakendu Mouli |
| Music Label |
ధీర ధీరాధి ధీర
తుఫాకి నీ కోర
సమరశంకం నీ బూరా
యుగముల గెలిచేరా
ఔరా నీదేమి ఆరా
రంగంలో షంషేరా
భూమ్మీదో ధృవతార
ధీరాధి ధీర
వీడి తూటాలే వేటల్లో
గెలుపుల హుంకారం
వీడి తోటల్లో పూలన్ని కత్తుల ఆకారం
అధీర అధీరా… రూపలే పలు నూరా
శ్వాసల్లో సెగలే చిమ్మీ… పగవై కమ్మే కోబ్రా
హే సూరా, హే సూరా… జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మీ… జగమే గెలిచే, కోబ్రా
వీడొకడనుకుంటే ఒకడే
ఇంకొకడనుకుంటే వాడే
ఒకడేమో చిక్కడు మనకీ
ఇంకొకడిది దొరకదు ఉనికీ
నీలో ఉంది ఒక ధర్మం
అది కూడా మించే తర్కం
నీ ధర్మం పలుకును సత్యం
నీ తర్కం గెలుచును లోకం
పలు విజయాలే నీవైనా
అహమే టెన్ టు ఫైవ్ కనరాదు
ఏ శిఖరాలు మకుటాలే
కోరవు ఏనాడు
అధీర అధీరా… రూపలే పలు నూరా
శ్వాసల్లో సెగలే చిమ్మీ… పగవై కమ్మే కోబ్రా
హే సూరా, హే సూరా… జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మీ… జగమే గెలిచే కోబ్రా
శత గజముల కూటమీ మధమే
అది అనచును వ్యాగ్రపు ఘనమే
పలు లక్షల సేనల జనమే
ఈ ఒక్కని యుక్తికి తృణమే
మాటల్లో ఉంటే నీతి
పట్టం కడుతుంది జాతి
ఎదురీతైతే నీ స్పూర్తి
జయమంటుంది ఈ జగతి
తను కొలువైతే కనరావు
చట్టం టెన్ టు ఫైవ్ న్యాయాలు
తన వ్యూహాలే కావాలి
ఈ యుగ ధర్మాలు
అధీర అధీరా… రూపలే పలు నూరా
శ్వాసల్లో సెగలే చిమ్మీ… పగవై కమ్మే కోబ్రా
హే సూరా, హే సూరా… జగదేక అధికార
శ్వాసల్లో సెగలే చిమ్మీ… జగమే గెలిచే కోబ్రా
Adheera song is from the Cobra movie.
Adheera song was sung by Haripriya, Nakul Abhyankar.
Adheera song lyrics were written by Rakendu Mouli.
Adheera song music was composed by AR Rahman.