| Movie Name | & English - Dookudu Cinema |
|---|---|
| Director | Srinu Vaitla |
| Star Cast | Mahesh Babu, Samantha |
| Music | Thaman S |
| Singer(s) | Karthik, Ramajogayya Sastry, Koti, Vardhini & Ranina Reddy |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
జే జే జే జేజేలంది… మా ఇంటి పెళ్లి కళ
దిల్ సే దిల్ ముడి వేసేయ్ మంది… వారే వీరై పోయేలా
కలలే కలిపిన అనుబంధంగా… ఇలలో ఇపుడే సుముహూర్తంగా
ఎదురైయ్యింది చల్లని వేళ… కల్యాణ లీలా
అదరదర గొట్టు డోలు… బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు… మోత మోగించే ట్రంఫెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్ళిది… కాదని జనమే నమ్మేట్టు
అరే అరె, అదరదర గొట్టు… ఇదివరకిలాంటి పెళ్లి లేనట్టూ
హే, మగపెళ్లివారమంతా… వాలిపోయాం విడిదింట
పనిలో పని పళ్ళకిని… మోసుకొచ్చేశామంట
మనవాడే శ్రీ మహాలక్ష్మిని… తీసుకెళ్తాం మావెంట
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
(పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా)
అత్తింటి కోడలిని… వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారారారా
అదర అదర అదరదరగొట్టు డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు మోత మోగించే ట్రంఫెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని జనమే నమ్మేట్టూ
హే, పిల్లేమో ఎరుపు… బంగారం కలగలుపు
పిల్లొడే కట్నం… ఇచ్చుకోక తప్పదు
హే హే, మావాడు మెరుపు పోటీలేని గెలుపు
స్విస్ బ్యాంకే రాసి ఇచ్చుకున్న చాలదు హే
హే, వజ్రం లాంటి పిల్లను ఇస్తాం చాలనుకోండి మీరు
తన అదృష్టంతో కలిసొస్తాయి… అన్ని లాంఛనాలు
హే, చూసేస్తున్నాడే వరుడు… లగ్గమెప్పుడన్నట్టు
ఆ మాటే అడిగిస్తుంది… పిల్ల బుగ్గ లోగుట్టు
తాపీగా ఉన్నారండి… తత్తర బిత్తర లేనట్టు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
హే, భూలోకమంతా… వెతికి చూసుకున్నా
ఇట్టాంటి అమ్మడు మీకు దక్కదు
హే, నీ కంటిపాప కోరి… చేరుకున్న వీరాధి వీరుడు
మా నిండు చంద్రుడు
హే, అన్నీ తానై ఉన్నాడు… దేవుడులాంటి నాన్న
నే కోరే వరమే లేదంట… తన సంతోషం కన్నా
ఆ, అలాంటి రామచంద్రుడు… నీలాగే ఉండుంటాడు
చిన్నారి జానకి సీతకు… చెయ్యందించి పెళ్లాడు
నీ కన్నతండ్రి కంట్లో… వెలిగే ఆనందం చూడు
ఆలస్యం దేనికింక తాళిబొట్టు కట్టేస్తా
పప్పర పప్ప పారా రారా
పప్పర పప్ప పారా రారా
అత్తింటి కోడలిని వేలు పట్టి వచ్చేస్తా
పప్పర పప్ప పారా రారా
అదర అదర అదరదరగొట్టు… డోలు బాజాల బీటు
ఊరు ఉయ్యాలుగేట్టు… మోత మోగించే ట్రంఫెట్టు
అట్టాంటిట్టాంటి పెళ్ళిది కాదని… జనమే నమ్మేట్టూ
Adara Adara song is from the & English - Dookudu Cinema movie.
Adara Adara song was sung by Karthik, Ramajogayya Sastry, Koti, Vardhini & Ranina Reddy.
Adara Adara song lyrics were written by Ramajogayya Sastry.
Adara Adara song music was composed by Thaman S.