| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | TikTok |
Actress Maadhavi Corona Virus Kavitha in Telugu
మొదటి అంకె నేను అని… మొదటి స్థానం నాది అని,
మొదటి నుంచి విర్రవీగే… మొదటి రకం పొగరుబోతా…
మొదట కళ్ళు తెరచి చూడు… ముసురుకున్న క్రిమిని చూడు
మొదలు లేదు.. చివర లేదు.. మొదలు అయితే అదుపు లేదు..
రాజు అనే భయం లేదు, పేద అనే జాలి లేదు… సోకెనంటే.. అంటు నేడు
ఇంటిలోనే కాదు కదా… ఊరిలోన చోటు లేదు..
దాచుకున్న డబ్బు రాదు… పేర్చుకున్న ఆస్తి రాదు…
తెచ్చుకున్న పేరు రాదు… పెంచుకున్న కీర్తి రాదు…
అండ రాదు.. దండ రాదు… ఆలి కూడా తోడు రాదు…
అంత దూరమెందుకులే..
దగ్గరైతే మహమ్మారి… అమ్మ రాదు, నాన్న రాడు
నువ్వు చచ్చిపోతే ఇంటికి శవం కూడా రాదు…
మొదటి అంకె నేను అని… మొదటి స్థానం నాది అని,
మొదటి నుంచి విర్రవీగే… మొదటి రకం పొగరుబోతా…
భూమిపై బతకడానికి మొదటి స్థానం వెతుక్కో …
స్థానం అంటే ప్రాణమని తెలుసుకో… ఆ ప్రాణం కాపాడుకొని బతికిపో…
#స్టేహోమ్ #స్టేసేఫ్
Actress Maadhavi Corona Virus Kavitha - Tiktok@Actressmaadhav song is from the movie.