
| Movie Name | Geethanjali (1989) |
|---|---|
| Director | Mani Ratnam |
| Star Cast | Nagarjuna Akkineni, Girija Shettar |
| Music | Ilaiyaraaja |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Aditya Music |
ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో… పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల… మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా… ఆమని పాడవే హాయిగా
ఓ ఓ ఓఓ… ఉల్లా లుల్ల లుల్ల ఉల్లా లుల్ల లుల్ల
ఉల్లా లుల్ల లుల్ల ఉల్లా లుల్ల లుల్ల… లుల్లా లుల్లా లుల్లా ఉల్లా లుల్ల లుల్ల………..
వయస్సులో వసంతమే… ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే… రచించెలే మరీచిక
పదాల నా యద… స్వరాల సంపద
తరాల నా కధ… క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేననీ…
ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలత…
ఓ ఓ ఓ… ఓఓ ఓ ఓ………………..
శుకాలతో పికాలతో… ధ్వనించిన మధూదయం
దివి భువీ కలా నిజం… స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే… మరింత చేరువై
నివాళి కోరిన… ఉగాది వేళలో
గతించిపోని గాధ నేననీ…
ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో… పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల… మౌనమైన వేళల
ఆమని పాడవే హాయిగా… ఆమని పాడవే హాయిగా
Aamani Paadave Hayiga song is from the Geethanjali movie.
Aamani Paadave Hayiga song was sung by S P Balasubramanyam.
Aamani Paadave Hayiga song lyrics were written by Veturi Sundararama Murthy.
Aamani Paadave Hayiga song music was composed by Ilaiyaraaja.