
| Movie Name | Devata (1965) |
|---|---|
| Director | K. Hemambharadhara Rao |
| Star Cast | NTR, Savitri |
| Music | SP Kodandapani |
| Singer(s) | Ghantasala |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలిసిన… ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి… జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి… జీవన జ్యోతి
పతిదేవుని మురిపించే… వలపుల వీణ
జీవితమే పండించే… నవ్వుల వాన
కష్టసుఖాలలో తోడూనీడగా
తల్లిని మరపించే… ఇల్లాలి ఆదరణ
కష్టసుఖాలలో తోడూనీడగా
తల్లిని మరిపించే… ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి… మధుర భావనా
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి… జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి… జీవన జ్యోతి
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా… పెంచే తల్లిగా
సతియే గృహసీమను… గాచే దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకుమారుగా
ఆలయాన వెలిసిన… ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి… జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి… జీవన జ్యోతి
Aalayana Velasina song is from the Devata movie.
Aalayana Velasina song was sung by Ghantasala.
Aalayana Velasina song lyrics were written by Veturi Sundararama Murthy.
Aalayana Velasina song music was composed by SP Kodandapani.