
| Movie Name | Abhimanyudu (1984) |
|---|---|
| Director | Dasari Narayana Rao |
| Star Cast | Sobhan Babu, Vijaya Santhi, Radhika, Silk Smitha |
| Music | KV Mahadevan |
| Singer(s) | S P Balasubramanyam, Susheela |
| Lyricist | Acharya Athreya |
| Music Label |
ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి
నీకో ముద్ద నాకో ముద్ద
ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి
నీకో ముద్ద నాకో ముద్ద
ఆకలి తీరే పోయింది… అత్తారింటికి దారేది
ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా
ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద నాకో ముద్ద
ఆకేసి పప్పేసి… బువ్వేసి నెయ్యేసి
తనకో ముద్ద నాకో ముద్ద
తినిపించువాడొచ్చే వేళయింది
ఒళ్ళంతా కళ్ళుగా ఎదురొచ్చింది
ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా
అతగడే జతగాడు అనుకున్నది
అనుకున్నదే కలలు కంటున్నది
అతగాడే జతగాడు అనుకున్నది
అనుకున్నదే కలలు కంటున్నది
కలలోని విందు… కనులవిందౌనా
కలలోని విందు… కనులవిందౌనా
మనసులోని ఆశ… మాంగళ్యమౌనా
ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా
ఆకుంది పప్పుంది… బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది ఆశా ఉంది
ఆకుంది పప్పుంది… బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది ఆశా ఉంది
తినిపించే చల్లని చెయ్యుంది
తినిపించే చల్లని చెయ్యుంది
బ్రతుకంతా నడిపించే తోడుంది
ఇలా ఇలా ఇలా, ఆఆ… ఇలా ఇలా ఇలా
ఇది కలా కలా కలా
మనమిలా ఇలా ఇలా
గాలిలా పువ్వులా తావిలా
కలిసి ఉన్నాము కలవకనే
కలుసుకున్నాము తెలియకనే
వెలుగుకు నీడకు చెలిమిలా
ఒక్కటైనాము కలవకనే
ఒదిగి ఉందాము కరగకనే
ఈ ప్రేమపత్రము
ఈ జన్మకు చెల్లు వేయుము
ప్రతి జన్మజన్మకు
మరల తిరగ వ్రాసుకొందము
ఎలా ఎలా ఎలా, ఆఆ
ఇలా ఇలా ఇలా
ఇలా ఇలా ఇలా
ఆకుంది పప్పుంది
బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది ఆశ ఉంది
వెన్నెల కలువలా చెలువలా
మందగించాము జతలుగ
విందులవుదాము కథలుగా
కన్నుల పాపలా చూపులా
చూచుకుందాము సొగసులుగా
పగలు రేయిగా… రేయి పగలుగా
ఈ రాగసూత్రము
మూడు ముళ్ళు వేసుకుందము
ఈ మూగమంత్రము
దీవెనగా చేసుకొందము
ఎలా ఎలా ఎలా, ఆ ఆ
ఇలా ఇలాఇలా
ఇలా ఇలా ఇలా
ఆకుంది పప్పుంది
బువ్వుంది నెయ్యుంది
ఆకలి ఉంది ఆశ ఉంది
మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్
Aakesi Pappesi song is from the Abhimanyudu movie.
Aakesi Pappesi song was sung by S P Balasubramanyam, Susheela.
Aakesi Pappesi song lyrics were written by Acharya Athreya.
Aakesi Pappesi song music was composed by KV Mahadevan.