
| Movie Name | Vijayanand |
|---|---|
| Director | Rishika Sharma |
| Star Cast | Shri Anant Nag, Nihal |
| Music | Gopi Sundar |
| Singer(s) | Vijay Prakash & Keerthana Vaidyanathan |
| Lyricist | Rambabu Gosala |
| Music Label | Anand Audio |
ఆగి చూసే నా కన్నులే
దారల్లే మెరిసేను చెలి సొగసులే
వాలిపో నువ్విలా గుండెపై గువ్వలా
ఉండిపో వెన్నెలా పెదవిపై నవ్వులా
మనసార మాటలే కలిసే
ఈ మౌనాల ప్రియరాగమే పిలిచే
ప్రేమలో జగమిలా… మరచిపోయేంతలా
జీవితం ఇంతలా… మధురమవ్వాలిలా
ఆగి చూసే నా కన్నులే
దారల్లే మెరిసేను… చెలి సొగసులే
ప్రేమ వరమై దొరికిందిలే
కలలను నిజముగా మార్చిందిలే
ఆశలేవో పెంచిందిలే
ఊసుల్లోన ఊయలే ఊపిందిలే
దూరమంతా టెన్ టు ఫైవ్ కరిగిందిలే
నువ్వంటే నేనంటూ
ఇవ్వాలె తెలిసే కొత్తగా ఉందిలే
నిన్ను చేరే నా అడుగులే
మైమరుపులో మునిగె నా తలుపులే
వాలిపో నువ్విలా… గుండెపై గువ్వలా
ఉండిపో వెన్నెలా… పెదవిపై నవ్వులా
మనసైనదేలే మన బంధం
విరహం లేని కాలం మన సొంతం
ప్రేమలో జగమిలా… మరచిపోయేంతలా
జీవితం ఇంతలా… మధురమవ్వాలిలా
Aagi Chuse Na Kannule song is from the Vijayanand movie.
Aagi Chuse Na Kannule song was sung by Vijay Prakash & Keerthana Vaidyanathan.
Aagi Chuse Na Kannule song lyrics were written by Rambabu Gosala.
Aagi Chuse Na Kannule song music was composed by Gopi Sundar.