
| Movie Name | & English - Ashta Chamma |
|---|---|
| Director | Mohan Krishna Indraganti |
| Star Cast | Nani, Colors Swathi |
| Music | Kalyani Malik |
| Singer(s) | Sri Krishna |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label | Super Cassettes Industries Limited |
ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే… ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే… ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే… ఇష్టంగా ఓడడం అంతే
ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే… ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే… ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే… ఇష్టంగా ఓడడం అంతే
ఓ, ఊరంతా ముంచేస్తూ… హంగామా చేస్తావేంటే గంగమ్మా
హ్మ్ మ్, ఘోరంగా నిందిస్తూ… ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూశాక నిన్ను, వేశాక కన్ను… వెనక్కెలాగ తీసుకోను
ఏం చెప్పుకోను, ఎటు తప్పుకోను… నువ్వొద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో… నిలేసే గళ్ళ బాటలో
నీ దాకా నన్ను రప్పించింది నువ్వే లేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే… ఇష్టంగా ఓడడం అంతే
ఓ, నా నేరం ఏముందే… ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా
హ్మ్ మ్, మందారం అయ్యింది… ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా
పూవంటి రూపం నాజుగ్గా గిల్లి… కెవ్వంది గుండె నిన్న దాకా
ముళ్ళంటి కోపం ఒళ్ళంతా అల్లి… నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా, ఆ ఆఆ
మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవిలేవీ అంత కొత్తేం కాదమ్మా
Aadinchi Ashta Chamma song is from the & English - Ashta Chamma movie.
Aadinchi Ashta Chamma song was sung by Sri Krishna.
Aadinchi Ashta Chamma song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Aadinchi Ashta Chamma song music was composed by Kalyani Malik.