| Movie Name | Srimathi Oka Bahumathi (1987) |
|---|---|
| Director | Visu |
| Star Cast | Chandra Mohan, Jayasudha |
| Music | Shankar-Ganesh |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Label |
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
కోతిమంద చేత… సేతువుల్ని నిర్మింప
చేసింది ఆడదిరా
నాడు తాళి కోసం… యముడి కాలపాశంతోనే
పోరింది ఆడదిరా
ఖడ్గ తిక్కన్న కత్తి తుప్పుపట్టకుండ
ఆపింది ఆడదిరా
అన్న బాలచంద్రుడి… చండభాను తేజం వెనుక
వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాడ్ని నడుపుతున్నది అటువంటి ఆడదిరా
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
దశరధుడ్ని నాడు… దిక్కులేని దశకు
తెచ్చింది ఆడదిరా
అయ్యో భీష్ముడంతటివాడ్ని అంపశయ్యను పెట్టి
చంపింది ఆడదిరా
అందాల అగ్గిలో… విశ్వామిత్రుడి నిష్ట
చెరిపింది ఆడదిరా
ఆహ పల్నాడు నేలంతా… పచ్చి నెత్తుట్లోన
తడిపింది ఆడదిరా
కోడల్ని తగలబెట్టే అత్త కూడ ఆడదిరా
కోడల్ని తగలబెట్టే అత్త కూడ ఆడదిరా
ఈ మగవాడ్ని నేడు చెరిచింది ఆడదిరా
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
పంచ పాండవులకు కీర్తి కిరీటాలు
పెట్టింది ఆడదిరా
అయ్యా ఇంద్రుడు చంద్రుడు
అపకీర్తి పాలైన కారణం ఆడదిరా
పోతపోసిన పున్నమంటి తాజ్ మహల్
పునాది ఆడదిరా
అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో
కూలగొట్టింది ఆడదిరా
మంచికైన చెడుకైనా మూలం ఒక ఆడదిరా
మంచికైన చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట… ఆమే కధే పాడునురా
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
ఆడదే ఆధారం
మన కధ ఆడనే ఆరంభం
ఆడదే సంతోషం
మనిషికి ఆడదే సంతాపం
Aadade Aadharam song is from the Srimathi Oka Bahumathi movie.
Aadade Aadharam song was sung by S P Balasubramanyam.
Aadade Aadharam song lyrics were written by Sirivennela Seetharama Sastry.
Aadade Aadharam song music was composed by Shankar-Ganesh.