Yeme Pilla Part-2 Song Lyrics - Folk Songs 2024

Yeme Pilla Part-2 Song Lyrics - Folk Songs 2024
Yeme Pilla Part-2 Song Lyrics penned by Kamal Eslavath, music composed by Madeen SK, and sung by Srilatha Yadav from Telugu cinema ‘Folk Songs 2024‘.
Yeme Pilla Part-2 Song Lyrics: Yeme Pilla Part-2 is a Telugu song from the film Folk Songs 2024 starring Lasya Jeevan , directed by . "Yeme Pilla Part-2" song was composed by Madeen SK and sung by Srilatha Yadav , with lyrics written by Kamal Eslavath.

Yeme Pilla Part-2 Song Details

Movie NameFolk Songs 2024 (2024)
Director
Star CastLasya Jeevan
MusicMadeen SK
Singer(s)Srilatha Yadav
LyricistKamal Eslavath
Music LabelOormi Music

 

Yeme Pilla Part-2 Song Lyrics in Telugu

పాట: ఏమే పిల్ల అంటంటే (Yeme Pilla Antante)
మ్యూజిక్ : మదీనా స్క్(Madeen SK)
లిరిక్స్: కమల్ ఇస్లావత్ (Kamal Eslavath)
అడిషనల్ లిరిక్స్ &ట్యూన్ : మానుకోట ప్రసాద్ (Manukota Prasad)
సింగర్ : శ్రీలత యాదవ్ (Srilatha Yadav)
తారాగణం: లాస్య జీవం (Lasya Jeevan)

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

సిటీ కొట్టి వాడు సైగ చేసి
సిగ్గులన్ని తట్టి లెప్పినాడే

పట్టు పట్టి ఓరా కంట చూసి
నన్నిట్ఠా ఉయ్యాలలూప్పినాడే

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

పొట్టి పొట్టంటూ పిలిచినాడే
పొట్టు పొట్టుగా నచ్చినాడే
ఇట్టా ఇట్టంగా రామన్నాడే
ఏమున్నవే బుట్టబొమ్మ అన్నాడే

పొట్టి పొట్టంటూ పిలిచినాడే
పొట్టు పొట్టుగా నచ్చినాడే
ఇట్టా ఇట్టంగా రామన్నాడే
ఏమున్నవే బుట్టబొమ్మ అన్నాడే

మూసి మూసి నవ్వుల పిల్లగాడే
మనసును మెల్లగా రువ్వినాడే
సన్నటి నడుమున చెయ్యిలేసి
చిన్నదాన నువ్వే చాలన్నడే

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

సోకులా సూపులు నాటినాడే
నా గుండె తలుపులే దాటినాడే
నేనంటే పడిసచ్చే పోటుగాడే
పానమియ్యనికి వెనకాడడే

సోకులా సూపులు నాటినాడే
నా గుండె తలుపులే దాటినాడే
నేనంటే పడిసచ్చే పోటుగాడే
పానమియ్యనికి వెనకాడడే

నవ్వుతాడే వాడు నెలవంకలా
తోడుంటాడే గువ్వగోరింకలా
వానికి లెదమ్మ ఏ వంకరా
పెట్టబోను అన్నాడే ఏ అల్లరా

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

పూత పెట్టినట్టు చైత్రమాసం
కూతపెట్టె వయస్సు వాడి కోసం
వాడి ప్రేమే నాకు నిండు గాసం
లేకుంటే బతుకంతా పాడు మోసం

పూత పెట్టినట్టు చైత్రమాసం
కూతపెట్టె వయస్సు వాడి కోసం
వాడి ప్రేమే నాకు నిండు గాసం
లేకుంటే బతుకంతా పాడు మోసం

ఇంకేది లేదయ్యా అక్కెర
వాడు బతికితే చాలయ్య శంకరా
ఒక్కపొద్దులుంటా ఈశ్వరా
జెర్ర ఒక్కటయేటట్టు చూడరా

ఒట్టుపెట్టుకున్న…
ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఒట్టుపెట్టుకున్న ఓ దేవా
యెండికొండ లాంటి పోరేడేరా
కట్టుకుంట్టగాని కట్నమియ్యా
కంటిపాపలెక్క చూసుకుంటా

ఏమే పిల్ల అంటంటే
ఏదో ఏదో అయితాందే
వాడు రయ్యే పిల్ల అంటంటే
ప్రాణం అసల ఆగన్నాటందే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk Songs 2024 Movie

  1. Yeme Pilla Part-2 Song Lyrics