
| Movie Name | Devetional (2022) |
|---|---|
| Director | |
| Star Cast | Venkateshwara swamy |
| Music | Sai Madhukar |
| Singer(s) | Srikrishna |
| Lyricist | Annamacharya Sankeerthana |
| Music Label | Moksha Studio |
బిరుదులన్నియు నీవే
బిరుదు లోకములెల్ల
అరయ నీపాదమందే అణ గుండె గాన
బహు దేవతాసార్వభౌమ బిరుదు నీకే
సహజము నీవు భూసతిపతివి గాన
వహి దేవతాచక్రవర్తి బిరుదు నీకే
విహితము చక్రము చే వెలసేవు గాన
పెను దేవ శిఖామణి బిరుదు నీకే చెల్లు
ఘన కౌస్తుభమణి గలవాడవు గాన
మును దేవదేవోత్తముడను బిరుదు నీకే
ననిచె బురుషోత్తమనాముడవు గాన
వొట్టుకొని దేవరాహుత్తరాయ బిరుదు నీదె
కిట్టి రాతిగుఱ్ఱము నెక్కితివి గాన
తిట్టమై శ్రీ వేంకటేశదేవ సింహమవు నీవే
అట్టె నారసింహుడవై అమరితి గాన
బిరుదులన్నియు నీవే song is from the Devetional movie.
బిరుదులన్నియు నీవే song was sung by Srikrishna.
బిరుదులన్నియు నీవే song lyrics were written by Annamacharya Sankeerthana.
బిరుదులన్నియు నీవే song music was composed by Sai Madhukar.